కోట్లు దండుకుని.. పొంతనలేని సమాధానాలు!  | Shilpa Chaudhary not Cooperating In Police Custody | Sakshi
Sakshi News home page

కోట్లు దండుకుని.. పొంతనలేని సమాధానాలు! 

Dec 12 2021 8:44 PM | Updated on Dec 12 2021 8:44 PM

Shilpa Chaudhary not Cooperating In Police Custody - Sakshi

సాక్షి, మణికొండ: శిల్పా చౌదరికి మూడురోజుల కస్టడీ ముగిసింది. విచారణకు ఏ మాత్రం సహకరించలేదని పోలీసులు తెలిపారు. కిట్టీ పార్టీలకు పిలిచి సంపన్న మహిళల నుంచి కోట్లు దండుకున్న శిల్పాచౌదరి పొంతనలేని సమాధానాలు, కాలయాపనకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిసింది. ఆమెను నార్సింగి పోలీసులు రెండవ సారి కస్టడీకి తీసుకుని శుక్రవారం నుంచి విచారిస్తున్న విషయం తెలిసిందే.

విచారణలో రెండవ రోజు శనివారం వాట్సాప్‌ గ్రూపులు, నిర్వహించిన కిట్టీ పార్టీలు, వాటికి హాజరయ్యే మహిళల వివరాలు, వారి నుంచి తీసుకున్న డబ్బు, ఎక్కడకు మళ్లించారనే విషయంలో పోలీసులు ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. అయితే.. ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పటం, పాత విషయాలు తనకు గుర్తు లేదని, కొందరు బ్లాక్‌ మనీని వైట్‌ చేయాలనే ఇచ్చారని, అప్పు రూపంలో ఎవరూ ఇవ్వలేని పేర్కొన్నట్టు సమాచారం.  కిట్టీ పార్టీలతో పాటు పేకాట, స్పాలను నిర్వహించినట్టు తమ వద్ద సమా చారం ఉందని పేర్కొన్నారని అయినా.. మౌనమే సమాధానమైందని తెలిసింది.

చదవండి: (పోలీసుల విచారణ.. మౌనమే శిల్పా సమాధానం?) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement