తీజ్‌ సంబరాల్లో విషాదం: వ్యక్తి ఆత్మహత్య

Sad Incident In Teej Festival Man Drunk Poison In  - Sakshi

జైనూర్‌ (ఆసిఫాబాద్‌): ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ మండలంలోని ఆశేపల్లిలో జరిగిన తీజ్‌ వేడుకల్లో విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులు పండుగలో ఆనందంగా పాల్గొనగా ఇంట్లో ఉన్న ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. ఆశేపల్లి గ్రామానికి చెందిన జాదవ్‌ మెఘాజీ(30) శనివారం రాత్రి కుటుంబ సభ్యులు తీజ్‌ సంబరాల్లో ఉండగా ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మెఘాజీ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి సోదరుడు జగదీశ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు, నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

చదవండి: కాపురానికి రావడం లేదని సెల్‌టవర్‌ ఎక్కి భర్త హల్‌చల్‌
చదవండి: తెలంగాణ సిగలో మరో అందం: వెలుగులోకి కొత్త జలపాతం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top