తల్లీకుమారుడి దారుణ హత్య

సాక్షి, చందూరు (నిజామాబాద్): జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చందూరు శివారులో తల్లీకుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. హుమ్నాపూర్ వాసి సావిత్రి(30) సహా రెండేళ్ల కుమారుడిని హత్య చేసిన నిందితుడు.. చందూరు శివారు అటవీ ప్రాంతంలో పాతిపెట్టాడు. గత నాలుగు రోజుల క్రితం హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు ఘన్‌పూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా సమాచారం. వివాహేతర సంబంధ వ్యవహారమే హత్యకు గల కారణంగా పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు.. పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలిసింది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి