
సాక్షి, విజయవాడ : ఎమ్‌కే రియల్ డెవలపర్స్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఈ సంస్థ వెంచర్ల పేరిట రూ.6 కోట్ల వరకు వసూలు చేసింది. రాజమండ్రికి చెందిన పట్నాల శ్రీనివాసరావు 2020 ఆగస్టులో గురునానక్ కాలనీలో ఎమ్‌కే రియల్ డెవలపర్స్ ఆఫీస్‌ను తెరిచాడు. కంపెనీ ఛైర్మన్‌గా ఉప్పు మనోజ్‌కుమార్, డైరెక్టర్‌గా బలగం రవితేజ ఉన్నారు. నిర్మాణాలు, ప్లాట్ల అమ్మకం పేరుతో ఏజెంట్ల ద్వారా అడ్వాన్సులు వసూలు చేశారు. ఎమ్‌కే సంస్థ కారణంగా విజయవాడ, గుంటూరు, కడప, శ్రీశైలం, విశాఖకు చెందిన పలువురు మోసపోయారు. నిర్వాహకుల ఫోన్లు స్విచాఫ్ ఉండటంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.