మైనర్‌ బాలిక శీలం ఖరీదు రూ.8 లక్షలు? | Men Molested Minor Girl In Warangal | Sakshi
Sakshi News home page

మైనర్‌ బాలిక శీలం ఖరీదు రూ.8 లక్షలు?

Aug 23 2021 11:57 AM | Updated on Aug 23 2021 11:57 AM

Men Molested Minor Girl In Warangal - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మరిపెడ(వరంగల్‌): ఓ గిరిజన మైనర్‌ బాలిక శీలం ఖరీదు రూ.8 లక్షలుగా పెద్ద మనుషులు నిర్ణయించినట్లు సమాచారం.. వివరాల్లోకి వెళితే. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధి బొత్తలతండాకు చెందిన ఓ మైనర్‌ బాలికను అదే తండాకు చెందిన వరుసకు సోదరుడైన వివాహిత వ్యక్తి మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు.

విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బాధితురాలి తల్లిదండ్రులు స్థానిక పెద్దమనుషులను సంప్రదించారు. వారు ఇరువురిని పిలిపించి మాట్లాడి గర్భవతిని చేసిన సదరు వ్యక్తికి రూ.8లక్షలు పరిహారం చెల్లించాలని తీర్మానం చేసినట్లు తెలిసింది.   

చదవండి: 3 పేర్లు 3 ఫోన్‌ నంబర్ల కేసు: సోదరి బాల్య స్నేహన్ని వాడుకుని..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement