
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ఖమ్మం: నగరంలోని ప్రశాంతినగర్‌కు చెందిన ఓ వివాహితపై లైంగికదాడికి పాల్పడిన ఘటనలో ఇద్దరు అన్నదమ్ములపై ఆదివారం ఖానాపురం హవేలి స్టేషన్‌లో కేసు నమోదైంది. సీఐ రామకృష్ణ కథనం ప్రకారం.. వివాహిత స్నానం చేస్తుండగా ఇంటి పక్కన ఉండే యువకుడు ప్రవీణ్ రాజ్ సెల్‌ఫోన్‌తో ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటితో బ్లాక్ మెయిల్ చేసి లైంగికంగా లొంగదీసుకున్నాడు.
చదవండి: బాలుడి ఆత్మహత్య.. తన ఆఖరి కోరికలు తీర్చాలని ప్రధానికి రిక్వెస్ట్
ఇదే అదునుగా అతని సోదరుడు గిరిధర్ కూడా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడు. మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో తనపై లైంగిక దాడి చేశారని, వేధింపులకు పాల్పడుతూ కులం పేరుతో దూషించారని బాధితురాలి ఫిర్యాదు చేసింది. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఏసీపీ ఆంజనేయులు పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
చదవండి: భార్యే తెగబడిందా.. ప్రియుడు సహకరించాడా..?