కంట్లో కారం చల్లి.. చేతులు నరికి | Man Hacked To Death With Axe In Sangareddy District | Sakshi
Sakshi News home page

కంట్లో కారం చల్లి.. చేతులు నరికి

Nov 12 2022 3:24 AM | Updated on Nov 12 2022 3:24 AM

Man Hacked To Death With Axe In Sangareddy District - Sakshi

మునిపల్లి(అందోల్‌): పాత కక్షలతో ఒక వ్యక్తిని అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచల్మెడ గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బేగరి ఆనంద్‌ (28), తలారి అంబయ్య చిన్నకొడుకు ప్రవీణ్‌ 2020 అక్టోబర్‌ 10వ తేదీన పేకాట ఆడారు.ఆనంద్‌తో పాటు ఇతరుల డబ్బును ప్రవీణ్‌ గెలుచుకున్నాడు.

ఆ ఉక్రోషంతో అతన్ని ఆనంద్‌ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. అప్ప­ట్లో పోలీసులు కేసు నమోదు చేసి ఆనంద్‌ను జైలుకు పంపించారు.బెయిల్‌పై ఇటీవలే బయటకు వచ్చిన అనంద్‌ను ఎలాగైనా చంపాలని ప్రవీణ్‌ కుటుంబ సభ్యులు పథకం వేసుకు న్నారు. శుక్రవారం గ్రామంలోని చర్చి సమీపంలో ఆనంద్‌ కనిపించగానే.. వెంట తెచ్చుకున్న కారం పొడిని అతని కంట్లో చల్లారు. తేరుకునేలోపే ఆనంద్‌ మెడపై తలారి అంబయ్య, స్వరూప, ప్రభుదాస్‌ గొడ్డలితో నరకడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బతికి ఉన్నాడనే అనుమానంతో ఆనంద్‌ రెండు చేతు లు నరికి మృతదేహం పక్కన పెట్టినట్లు గ్రామస్తులు తెలిపారు. సీఐ సంతోష్‌ కుమార్, సి బ్బం­ది సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement