న్యాయవాది వింత ప్రవర్తన..రక్తాన్ని​ ఇంజెక్ట్‌ చేసి, సిరంజీలతో దాడి చేసి..చివరికి

Lawyer Injecting Blood Into Food At 3 Grocery Stores In London - Sakshi

Lawyer Accused of Injecting Blood Into Food: కొంతమంది పైశాచికంగా ఎదుటవాళ్ల మీద కోపంతోనూ లేదా ద్వేషంతోనూ వికృతమైన పనులకు ఒడిగడుతుంటారు. అలాంటి పలు ఘటనలు గురించి విన్నాం కూడా. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి దారుణమైన దుశ్చర్యకు ఒడిగట్టాడు. అది కూడా ఎలా చేస్తున్నాడో వింటే కచ్చితంగా షాక్‌ అవుతారు.

అసలు విషయంలోకెళ్తే...లండన్‌లోని వ్యక్తి సూపర్ మార్కెట్‌లోని ఆహార పదార్థాల్లోకి తన రక్తాన్ని ఇంజెక్ట్ చేశాడు. అలా ఒకటి రెండు కాదు ఏకంగా మూడు సూపర్‌ మార్కెట్‌లలోని ఆహార పదార్థాల్లోకి రక్తాన్ని ఇంజెక్ట్‌ చేశాడు. ఈ మేరకు అతను చేస్తున్న పని సీసీటీవీలో రికార్డు అయ్యింది. దీంతో సదరు షాపు వాళ్లు కస్టమర్‌లను పంపించేసి ఆహార పదార్థాలన్నింటిని పడేశారు. అంతేకాదు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డుని నెట్టడం సిరంజీలు విసరడం వంటివి చేశాడు.

పోలీసులు ఈ ఘటనల్లో సుమారు 21 సిరంజీలను స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందుతుడు లియోయాయ్ ఎల్‌గరీబ్‌గా గుర్తించారు. అతను స్వంతంగా లీగల్‌ కన్సల్టెన్సీని కూడా ఉంది. అయితే సూపర్‌ మార్కెట్లన్నీ సుమారు రూ.5 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. ఈ మేరకు  పోలీసులో ప్రతి సీసీ ఫుటేజ్‌ని పరీక్షించి చూడాగా ..ఆపిల్‌లు, చికెన్ టిక్కా ఫిల్లెట్‌ల ప్యాకెట్‌లకు అతను రక్తాన్ని ఇంజెక్ట్‌ చేసినట్లు తెలిసింది. అంతేకాదు విచారణలో అవన్నీ 37 ఏళ్ల క్రితం నాటి ఆహారంగా చూపించడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.

పైగా ఆ సీసీ ఫుటేజ్‌లో అతను ఒక బకెట్‌లో హైపోడెర్మిక్ సూదులను మోస్తున్నట్లు కూడా కనిపించిందన్నారు. కానీ నిందుతుడు లియోయాయ్ ఎల్‌గరీబ్‌ మాత్రం వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు లండన్‌లోని ఐల్‌వర్త్ క్రౌన్ కోర్టు ఆ వింత కేసును విచారించింది. అయితే నిందుతుడి తరుఫు న్యాయవాదులు మాత్రం అతని పిచ్చివాడని, మానసిక పరిస్థితి బాగోలేదని చెబుతున్నారు. మరోవైపు సైక్రియార్టిస్ట్‌ డాక్టర్లు కూడా అతని మానసిక పరిస్థితి గందరగోళంగా ఉందని కాబట్టి అతను ఉద్దేశపూర్వకంగా చేసిన నేరంగా భావించలేకపోతున్నాం అని చెప్పారు. దీంతో లండన్‌ కోర్టు అతను ఈ నేరం చేసినప్పుడూ అతని మానసిక పరిస్థితి ఎలా ఉందో విచారించమని ఆదేశించడం గమనార్హం. 

(చదవండి: మంచు పర్వత అధిరోహణ.. దూసుకొచ్చిన హిమపాతం!)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top