
యశవంతపుర: కొత్తగా పెళ్లయిన మహిళా కానిస్టేబుల్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు ఉత్తర తాలూకా చిక్కగొల్లరహట్టిలో జరిగింది. మృతురాలు నేత్రా (27). ఈమె కామాక్షిపాళ్య ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌లో పని చేస్తోంది. పీణ్యాలో కానిస్టేబుల్ అయిన మంజునాథ్ ఆమెను నెలరోజుల కిందట ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరిదీ తుమకూరు జిల్లా స్వస్థలం. వంట చేసే విషయమై భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగినట్లు, దీంతో ఆమె ఉరివేసుకున్నట్లు తెలిసింది. మాదనాయనహళ్లి పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.