Karimnagar Warangal Highway Accident: Two RTC Buses Collide, 24 Injured - Sakshi
Sakshi News home page

వరంగల్‌ హైవేపై 2 ఆర్టీసీ బస్సులు ఢీ

Jan 13 2021 10:24 AM | Updated on Jan 13 2021 6:45 PM

Karimnagar Warangal National Highway 2 RTC Buses Colloid - Sakshi

సాక్షి, వరంగల్ అర్బన్‌‌: పండగపూట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి ఒకదానితో ఒకటి ఢీ కొన్నాయి. వివరాలు.. కరీంనగర్ - వరంగల్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ వద్ద ఉన్న ఈ జాతీయ రహదారిపై రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 24మందికి తీవ్ర గాయాలయ్యాయి. 12 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా ఇద్దరు డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement