జూబ్లీహిల్స్‌ దాడిలో గాయపడ్డ రియల్టర్ రవీందర్ రెడ్డి మృతి

Hyderabad: Realtor Ravinder Reddy injured in Knife Attack At Jubilee Hills - Sakshi

సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ దాడిలో గాయపడ్డ రియల్టర్‌ రవీందర్‌రెడ్డి మృతిచెందారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. కాగా రవీందర్‌ రెడ్డి అనే స్థిరాస్తి వ్యాపారిపై అతని అల్లుడు మోహన్‌రెడ్డి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జూబ్లీహిల్స్‌లో చోటుచేసుకుంది. బాధితుడు రవీందర్‌ రెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చి తన కారులో ఉన్న సెల్‌ఫోన్ తీసుకోవడానికి రాగా అక్కడే కాపుకాసిన అతని బంధువు ఒక్కసారిగా కత్తితో దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు రవీందర్‌ రెడ్డిని సమీపంలోని ఆపోలో ఆసుపత్రికి తరలించారు. 
చదవండి: బెదిరించానని చెబితే ఖతం చేస్తా...

ఘటనా స్థలంలో పోలీసులు నిందితుడు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. దాడికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సంఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న ప్రత్యక్షసాక్షి వాచ్‌మెన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా స్థిరాస్తి వ్యాపారంలో మూడున్నర లక్షల కమిషన్ విషయం గొడవకు కారణమని తెలుస్తోంది.
చదవండి: ఆంత్రాక్స్‌ వ్యాధి కలకలం: మటన్‌ కొంటున్నారా..? జర జాగ్రత్త!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top