ఏం కష్టం వచ్చిందో పాపం...ఒకే కుటుంబంలోని ఐదుగురు ఏడవ అంతస్తు నుంచి దూకి... | French Family Plunged Off Seventh floor Balcony In Switzerland | Sakshi
Sakshi News home page

ఏం కష్టం వచ్చిందో పాపం...ఒకే కుటుంబంలోని ఐదుగురు ఏడవ అంతస్తు నుంచి దూకి...

Mar 25 2022 8:02 PM | Updated on Mar 25 2022 8:03 PM

French Family Plunged Off Seventh floor Balcony In Switzerland - Sakshi

చాలా రిజర్వ్‌డ్‌గా ఉండే ఉన్నత కుటుంబం ఏం కష్టం వచ్చిందో గానీ ఒకేసారి అందరూ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. కుటుంబంలో నలుగురు మృతిచెందగా, బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.

A Family Of 5 Mysteriously Jumped: ఇంతవరకు చాలా మంది ఏవేవో కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోవడం గురించి విన్నాం. ఆర్థిక సమస్యల వల్లనో లేక భయంకరమైన సమస్యలకు తాళలేక చనిపోయిన ఘటనలు చూశాం. ఇక్కడ ఒక కుటుంబంలోని సభ్యులు ఏ కారణం లేకుండా అది కూడా ఉన్నత కుటుంబ నేపథ్యం ఉండి ఒకేసారి ఐదుగురు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఈఘటన స్విట్జర్లాండ్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే...స్విట్జర్లాండ్‌లోని మాంట్రిక్స్‌లో ఫ్రెంచ్‌ కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఏడవ అంతస్తు బాల్కనీ నుంచి దూకేశారు. అయితే వారు తమ కొడుకుని పాఠశాలకు పంపిచంకుండా ఇంటి వద్ద చదివించడానికి గల కారణాలు విచారంచేందుకు పాఠశాల అధికారులు ఇంటికి వచ్చారు. అయితే వారు ఎంత తలుపు కొట్టిన ఎలాంటి స్పందన కనిపించకపోవడంతో వాళ్లు వెళ్లిపోయారు. అయితే కాసేపటికి ఒక ఇంటిలోని సభ్యులు బాల్కని నుంచి దూకేశారంటూ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో పోలీసులు ఘటన స్థలానికి రాగానే కుటుంబ సభ్యులలోని నలుగురు చనిపోయారు ఆ బాలుడు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కుటుంబం మొత్తం ఫ్రెంచ్ పౌరులని, వారు స్విట్జర్లాండ్‌లో చాలా ఏళ్లుగా నివసిస్తున్నారని పోలీసులు చెప్పారు. ఈ కుటుంబం చాలా రిజర్వ్‌డ్‌ ఉంటుందని పెద్దగా ఎవరితో కలవరని స్థానికులు చెబుతున్నారని అన్నారు. అయితే బాలుడిని పాఠశాలకు పంపిచంకుండా హోం స్కూల్‌లో చదవించడానికి గల కారణాలను తెలుసుకోవడానికి అధికారులు రావడంతోనే ఈ ఘటన వెలుగు చూసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మెదటు పెట్టారు.

(చదవండి: రక్త ప్రవాహంలో మైక్రోప్లాస్టిక్‌ కణాలు...నిత్యం వాడే ప్లాస్టిక్కే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement