రక్తంలో తిష్ట వేసిన ప్లాస్టిక్‌ కణాలు..షాక్‌లో శాస్త్రవేత్తలు! | Found Dutch Researchers Plastic Particles In Human Blood | Sakshi
Sakshi News home page

రక్త ప్రవాహంలో మైక్రోప్లాస్టిక్‌ కణాలు...నిత్యం వాడే ప్లాస్టిక్కే

Published Fri, Mar 25 2022 5:09 PM | Last Updated on Fri, Mar 25 2022 6:00 PM

Found Dutch Researchers Plastic Particles In Human Blood  - Sakshi

మానవుని రక్త ప్రవాహంలో మైక్రోప్లాస్టిక్‌ కణాలను గుర్తించిన శాస్త్రవేత్తలు. ఆ కణాలన్ని గృహోపకరణాలకు, క్యారియర్‌ బ్యాగులుగా వాడే ప్లాస్టిక్ అని తెలిపారు.

Microplastic in human blood: ప్లాస్టిక్‌ వాడొద్దు అంటూ ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు ఎన్నోఏళ్లుగా మొత్తుకుంటున్నారు. కానీ ప్రజలు తమ నిత్య జీవన విధానంలో ఈ ప్లాస్టిక్‌ వస్తువులకు అలవాటుపడిపోయారు. అంతతేలిగ్గా బయటేపడే అవకాశం తక్కువ. అదీగాక ప్లాస్టిక్‌ చాలా చౌకగా దొరకడమే కాకుండా సామాన్య మానవునికి సైతం అందుబాటులో ఉంటుంది. ప్లాస్టిక్‌ పర్యావరణానికి హానికరం అందువల్ల దయచేసి వాడొద్దు అంటూ నినాదాలు చేసి మరీ సహజ పద్ధతుల్లో తయారు చేసినవి మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేశారు కూడా. ప్రజలు ఇటీవలే వాటిని వాడేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గానీ ఆ ప్లాస్టిక్‌ వల్ల జరగవల్సిన నష్టం ఎప్పడో మనిషికి జరిగిపోయింది అంటున్నారు డచ్‌ శాస్త్రవేత్తలు.

అసలేం జరిగిందంటే...పది మంది వ్యక్తుల రక్త నమూనాల్లో దాదాపు 8 మంది రక్తంలో మైక్రోప్లాస్టిక్‌ కణాలను గుర్తించామని డచ్‌ శాస్త్రవేత్తలు తమ తాజా అధ్యయనాల్లో వెల్లడించారు. తాము పరిశోధనలు చేసిన సుమారు 77 శాతం మందిలో రక్త ప్రవాహంలో మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నాయని తెలిపారు. ప్లాస్టిక్ గాలితో పాటు ఆహారం, పానీయాల ద్వారా కూడా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుందని  వ్రిజే యూనివర్సిటీ ఆమ్‌స్టర్‌డామ్‌లోని ఎకోటాక్సికాలజీ అండ్ వాటర్ క్వాలిటీ అండ్ హెల్త్ ప్రొఫెసర్ డిక్ వెథాక్ నివేదికలో తెలిపారు. 

పైగా పాలీప్రొఫైలిన్, పాలీస్టైరిన్, పాలీమిథైల్ మెథాక్రిలేట్, పాలిథిలిన్ పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ (పీఈటీ) వంటి ఐదు రకాల ప్లాస్టిక్‌ల గురించి పరిశోధనాలు చేయడం మెదలు పెట్టారు. అందులో భాగంగా దాదాపు 22 మంది రక్త నమునాలను సేకరించారు. అయితే ఆ పరిశోధనల్లో చాలా షాకింగ్‌ విషయాలు బయటపడ్డాయి. సుమారు 17 మంది రక్తదాతల రక్తంలో ప్లాస్టిక్ రేణువుల ఉన్నాయని తెలిపారు.

ఆ పరిశోధనల్లో కొంతమంది రక్తదాతల్లో గృహోపకరణాలకు వినియోగించే ప్లాస్టిక్‌ ఉందని, మరికొంతమంది రక్తం క్యారియర్ బ్యాగ్‌లను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పాలిథిన్‌ని గుర్తించినట్లు తెలిపారు. అంతేకాదు పరీక్షించిన వారిలో 50 శాతం మంది రక్తంలో పాలిథిలిన్ టెరెఫ్తాలేట్, 36 శాతం మంది రక్తప్రవాహంలో పాలీస్టైరిన్ కూడా ఉందని వెల్లడించారు. ఏదీఏమైన మానవుని ఆరోగ్యం ప్రమాదకరమైన స్థితిలోకి చేరకమునుపే ప్లాస్టిక్‌కి సంబంధించిన వస్తువులను పూర్తిగా బ్యాన్‌ చేయాల్సిందే.

(చదవండి: బరువులు ఎత్తడంలో, ఎత్తులను ఎక్కడంలోనూ దిట్ట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement