దారుణం.. తలపై సుత్తితో మోది.. | Father Assassination Son In Visakhapatnam | Sakshi
Sakshi News home page

తండ్రి చేతిలో తనయుడి హతం

Aug 13 2020 6:33 AM | Updated on Aug 13 2020 6:33 AM

Father Assassination Son In Visakhapatnam - Sakshi

హతుడు జలరాజు (ఫైల్‌), విలపిస్తున్న కుటుంబ సభ్యులు 

పెందుర్తి: తండ్రి చేతిలో తనయుడు దారుణ హత్యకు గురయ్యాడు. తలపై సుత్తితో మోది ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..  సీమేన్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన గొరుపాటి వీర్రాజు అనే వ్యక్తి  పెందుర్తి సమీపంలోని చినముషిడివాడ సత్యానగర్‌లో  కుమారుడు జలరాజు (41)తో కలిసి నివాసం ఉంటున్నాడు. జలరాజు కూడా  సీమెన్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల డ్యూటీ నుంచి వచ్చి ఇంట్లోనే ఉంటున్నాడు.

అతను బుధవారం ఉదయం ఇంటి పెరట్లో జలరాజు పనిచేస్తుండగా తండ్రి  వచ్చి పక్కనే ఉన్న సుత్తితో కుమారుడి తలపై గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆటోలో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచాడు. నిందితుడు  పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. కాగా వీర్రాజుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబంలో ఆస్తికి సంబంధించి వివాదాలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. జలరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఇన్‌చార్జి సీఐ మళ్ల అప్పారావు, ఎస్‌ఐలు శ్రీను, హరి ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement