
సాక్షి,మేడ్చల్‌జిల్లా: రుణమాఫీ కాలేదని మేడ్చల్ జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయ ఆవరణలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్‌లో నివాసం ఉండే రైతు సురేందర్ రెడ్డి(52) తనకు రుణమాఫీ కాలేదని శుక్రవారం(సెప్టెంబర్6) ఉదయం వ్యవసాయ శాఖ కార్యాలయ ఆవరణలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు.
రైతు ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.