అధిక శక్తులు ఉన్నాయని లక్షలు దండుకుంటున్న కేటుగాడు

Fake Baba Puja Fraud In Hyderabad - Sakshi

హైదరాబాద్‌: పూజల పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న కేటుగాడిని రాచకొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల ప్రకారం..  లోయర్‌ ట్యాంక్‌ బండ్‌కు చెందిన సదరు మహిళ తన ఇంట్లో నెలకొన్న ఆర్థిక, అనారోగ్య సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. రాకేష్‌ అనే వ్యక్తిని ఆశ్రయించింది. ఈ క్రమంలో అతగాడు.. తనకు అధిక శక్తులు ఉన్నాయని, మంత్రాలతో మహిళ సమస్యలను దూరం చేస్తానని నమ్మించాడు. అయితే, దీనికోసం అమ్మవారికి పూజ చేయాలని దానికి పెద్ద మొత్తంలో ఖర్చుఅవుతుందని తెలిపాడు. అంతటితో​ ఆగకుడండా.. పూజలు చేస్తానని చెప్పి ఆ మహిళ నుంచి 1,60,000ల నగదు, 5 తులాల బంగారాన్ని రాకేష్‌ తీసుకున్నాడు.

 పూజల గురించి ఎన్నిసార్లు ప్రస్తావించిన ఆ వ్యక్తి మాటను దాటవేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ మహిళకు అనుమానం వచ్చి.. తాను ఇచ్చిన నగదు, బంగారం తిరిగి ఇచ్చేయాలని వేడుకుంది. ఈ నెల (ఆగస్టు) 10 న మహిళ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని కోరింది. దీంతో మోసగాడు.. బాధిత మహిళను అసభ్యపదజాలంతో దూషించి ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టాడు. దీంతో బాధితురాలు తాను మోసపోయినట్లు గ్రహించి నెరెడ్‌మెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోనికి తీసుకుని పలుసెక్షన్‌ల కింద కేసులను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు విచారణలో రాకేష్‌  ఇప్పటికే మరో 5 గురిని కూడా మోసం చేసినట్లు గుర్తించారు.  

చదవండి: మద్యానికి బానిసైన కొడుకును మందలించినందుకు...

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top