డ్రెస్‌ మార్చుకుంటుండగా వీడియో.. బ్లాక్‌ మెయిల్‌ చేసి

Dress Changing And BlackMail Former Employee Harassment - Sakshi

గురుగ్రామ్‌లో ఘటన

గర్భవతి కాగా తీసివేయించిన దుండగుడు

నిందితుడు ఆమె పని చేసే ల్యాబ్‌ మాజీ ఉద్యోగి

గురుగ్రామ్‌: ల్యాబోరేటరీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి డ్రెస్‌ మార్చుకుంటుండగా ఒకరు వీడియో తీశాడు. అనంతరం ఆమెను ఆ వీడియో చూపించి బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ బలత్కారానికి పాల్పడ్డాడు. అతడితో పాటు మరికొందరు ఆమెపై అత్యచారానికి పాల్పడడమే గాక ఆమె గర్భం దాలిస్తే అబార్షన్‌ చేయించాడు. దీంతో అతడి వేధింపులు తాళలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన హరియాణలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..

గురుగ్రామ్‌ సెక్టార్‌ 52లో ఉన్న ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా ఓ యువతి (26) పని చేస్తోంది. అయితే ల్యాబ్‌లో పని చేసేప్పుడు డ్రెస్‌ వేరే (యూనిఫార్మ్‌) ఉంటుంది. ఉద్యోగానికి వచ్చేప్పుడు.. వెళ్లేప్పుడు డ్రెస్‌ మార్చుకోవాల్సి ఉంటుంది. దీంతో ఒకరోజు యధావిధిగా ఆమె డ్రెస్‌ మార్చుకుంటోంది. ఆమెతో పాటు ఒకప్పుడు ల్యాబ్‌లో పని చేసిన యువకుడు సచిన్‌ సింగ్‌ తివారీ. ఒకరోజు ఆమె డ్రెస్‌ మార్చుకుంటుండగా వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోను యువతికి చూపించి వేధించసాగాడు. ఈ క్రమంలో మంగళవారం ఆమెను బ్లాక్‌ మెయిల్‌ చేసి అతడి వద్దకు పిలుపించుకున్నాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

తాజాగా మంగళవారం ‘మాట్లాడుదాం రా’ అని అతడు తన స్వగ్రామం వాజిరబాకు పిలిపించుకున్నాడు. ఆమె రాగానే కారులోకి ఎక్కించుకుని బాద్షాపూర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మరోసారి బలాత్కారం చేయబోగా యువతి అడ్డగించింది. అయితే కత్తి చూపెట్టి భయపెట్టాడు. కారులోనే ఆమెను బలవంతంగా దాడి చేస్తుండడంతో యువతి అరిచింది. ఆమె కేకలు విన్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. పోలీసులకు ఆమె అతడి దారుణాలను వివరించింది. గతంలో అనేకసార్లు బ్లాక్‌ మెయిల్‌ చేసి లోబర్చుకున్నాడని వాపోయింది. గర్భం దాలిస్తే తీయించి వేశాడని కన్నీటి పర్యంతమైంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top