రొమేనియా బాలిక అత్యాచార ఘటనపై కాంగ్రెస్‌ డిమాండ్‌

Congress Demands CBI Enquiry In Amnesia Pub Gangrape Case - Sakshi

డీజీపీ ఆఫీసు ముట్టడికి ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్‌ యత్నం.. అడ్డుకున్న పోలీసులు

ప్రభుత్వ తీరుతోనే దారుణమైన నేరాలు: సీఎల్పీ నేత భట్టి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలో బాలికపై అత్యాచార ఘటన దారుణమని, రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పా యని కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని, పూర్తిస్థాయి విచారణను సీబీఐకి అప్పగిం చాలని డిమాండ్‌ చేసింది. కాంగ్రెస్‌ అను బంధ ఎన్‌ఎస్‌యూఐ, యూత్‌ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిం చేందుకు ప్రయత్నించారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు నిష్పక్షపాతంగా లేదని మండిపడ్డారు. బాధితురాలికి న్యాయం జరిగేవరకు పోరాడుతామని ప్రకటించారు.

సర్కారు తీరుతో డ్రగ్, పబ్‌ కల్చర్‌
టీఆర్‌ఎస్‌కు భజన చేసే వారికి పబ్‌ల అను మతి ఇస్తున్నారని.. పబ్‌ లైసెన్సులను ని యంత్రించకపోవడం వల్లనే రాష్ట్రంలో దారు ణ ఘటనలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన మీడియా తో మాట్లాడారు. పబ్‌లోకి మైనర్లను ఎలా అనుమతించారని నిలదీశారు. డ్రగ్స్‌ను నియంత్రించలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఈ ఘటనకు బాధ్యత వహించాలన్నారు. ‘మద్యాన్ని ఆదాయవనరుగా ప్రభుత్వం చూడటం వల్లనే రాష్ట్రంలో నేరాల రేటు పెరుగుతోంది. బాలిక తల్లిదండ్రులు ధైర్యం గా ఫిర్యాదు చేసినా.. పోలీసుశాఖ ఎందుకు భయపడుతుందో అర్థం కావడం లేదు’ అని పేర్కొన్నారు. కాగా.. నేరాల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని శ్రీధర్‌బాబు మండిపడ్డారు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించడం ద్వారా ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కలిగేలా చూడాలని పేర్కొన్నారు.

డీజీపీ కార్యాలయ ముట్టడికి యత్నం
రొమేనియా బాలికపై రేప్‌ ఘటనను నిర సిస్తూ, దోషులను కఠినంగా శిక్షించాలంటూ కాంగ్రెస్‌ అనుబంధ సంఘాలు ఎన్‌ఎస్‌ యూఐ, యూత్, మహిళా కాంగ్రెస్‌ల ఆధ్వ ర్యంలో శనివారం డీజీపీ కార్యాలయ ముట్ట డి చేపట్టారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్య క్షుడు బల్మూరి వెంకట్, హైదరాబాద్‌ యువ జన కాంగ్రెస్‌ కమిటీ, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావుల నేతృత్వంలో  నేతలు, కార్యకర్తలు డీజీపీ కార్యాలయం వైపు దూసుకువచ్చారు. పోలీసులు ఆందోళ నకారులను అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. 

కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు
అనంతరం వెంకట్, సునీతారావు మీడియా తో మాట్లాడారు. బాలికపై అత్యాచారం విష యంలో రాజకీయ డ్రామా నడుస్తోందని వెంకట్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో షీటీమ్స్‌ ఏం చేస్తున్నాయని సునీతారావు ప్రశ్నించా రు. పోలీసులకు గాజులు, చీరలు పంపిస్తా మని, వాటిని వేసుకుని ఇంట్లో కూర్చోవాల న్నారు. మరోవైపు యూత్‌ కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు శనివారం రాత్రి అమ్నీషియా పబ్‌ వద్ద ధర్నాకు దిగారు. పబ్‌ను సీజ్‌ చేయాలంటూ ఆందోళన చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top