హైదరాబాద్ కేంద్రంగా హెచ్‌1బీ వీసా స్కామ్‌

Cloudgen H1B Visa Scam In America - Sakshi

న్యూయార్క్‌, హైదరాబాద్‌ : అమెరికాలో ఓ ఘరానా మోసం వెలుగుచూసింది. హైదరాబాద్ కేంద్రంగా హెచ్1బీ వీసా స్కామ్‌ బయటపడింది. క్లౌడ్‌జెన్‌ అనే ఓ టెక్‌ కంపెనీ 'బెంచ్‌ అండ్‌ స్విచ్‌' తరహా మోసానికి పాల్పడింది. థర్డ్‌ పార్టీ కోసం పని ఉందంటూ భారత్‌ నుంచి ఉద్యోగులకు బోగస్‌ కాంట్రాక్టులు ఇచ్చింది. కాంట్రాక్టుల ఆధారంగా హెచ్‌1బీ వీసాలు జారీ చేసింది. అమెరికా చేరుకున్న తర్వాత ఉద్యోగులకు పని వెతికి.. అడిగిన కంపెనీకి హెచ్‌1బీ వీసా కలిగిన ఉద్యోగులను సరఫరా చేసింది. సాధారణంగా హెచ్‌1బీ ప్రాసెస్‌ ద్వారా ఉద్యోగులను పొందడానికి సుదీర్ఘ ప్రయాస పడాల్సి ఉంటుంది.

అయితే, వీసాతో రెడీగా ఉన్న ఉద్యోగులను కలిగి ఉండడం క్లౌడ్‌జెన్‌కు మార్కెట్‌లో అడ్వాంటేజ్‌గా మారింది. ఉద్యోగుల నుంచి కమీషన్ల రూపంలో.. 2013 నుంచి 2020 మధ్య 5 లక్షల డాలర్ల మేర వసూళ్లు చేసింది. రికార్డుల ప్రకారం పల్లెంపాటి శశి క్లౌడ్‌జెన్ సంస్థకు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం మానస్పాస్‌, హైదరాబాద్ గచ్చిబౌలి.. కెనడా, రొమేనియా దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. కాగా, క్లౌడ్‌జెన్‌ కంపెనీ ప్రతినిధులు టెక్సాస్‌లోని హూస్టన్‌ కోర్టులో తమ నేరాన్ని అంగీకరించారు.

చదవండి : పెళ్లైన 2 రోజులకే భర్త మాజీ భార్యకు కిడ్నీ దానం

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top