Chennai: Case Filed Against BJP Leader For Molestation Boy, Details Inside - Sakshi
Sakshi News home page

బైక్‌పై ఎక్కించుకుని.. బాలుడిపై బీజేపీ నేత లైంగిక వేధింపులు

Jun 5 2023 10:37 AM | Updated on Jun 5 2023 11:28 AM

Chennai: Case Filed Against Bjp Leader For Molestation Boy - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,చెన్నై (తిరువొత్తియూరు): చైన్నె విల్లివాకంలో లిఫ్ట్‌ అడిగి బైక్‌ ఎక్కిన విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నెలోని విల్లివాక్కం శివాలయం ప్రాంతంలో శనివారం రాత్రి ఓ బాలుడు ఏడుస్తున్నాడు. గమనించిన స్థానికులు బాలుడిని ప్రశ్నించారు. తాను విల్లివాక్కంలో వున్న పాఠశాలలో చదువుకుంటున్నానని, లిఫ్ట్‌ అడిగి ఒకరి బైక్‌ ఎక్కినట్టు తెలిపాడు.

అతను తనపై లైంగికంగా వేధించినట్టు పేర్కొన్నాడు. కొందరు బాలుడు చెప్పిన విషయాలను సెల్‌ ఫోన్‌లో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అది వైరల్‌ అయింది. ఈ విషయం తెలుసుకున్న విల్లివాక్కం పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బాలుడిని వేధించిన అంబత్తూరు పశ్చిమ బీజేపీ బూత్‌ కమిటీ సభ్యుడు బాలచందర్‌ (47)ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

చదవండి: నవదంపతులుగా గదిలోకి.. ఎంత సేపటికీ రాలేదు.. తీరా లోపలకి వెళ్లి చూస్తే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement