జనసేన నేత రాఘవరావుపై కేసు నమోదు

Case Filed On Janasena Leader Raghava Rao - Sakshi

విశాఖ: ఓ మైనర్‌ బాలికను వేధించిన ఘటనకు సంబంధించి జనసేన నేత రాఘవరావుపై కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదుతో రాఘవరావుపై కేసు నమోదు చేసినట్లు సీఐ రామారావు తెలిపారు. 354ఏ, 354డి, 448, 307, 427, 509 సెక్షన కింద కేసు నమోదు చేశామన్నారు. రాఘవరావును అదుపులోకి తీసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. 

కాగా, గత కొంతకాలంగా నగరానికి చెందిన ఓ మైనర్‌ బాలికను రాఘవరావు వేధింపులకు గురిచేస్తున్నాడు. చినవాల్తేర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్న ఆ బాలికకు వాట్సాప్‌లో అసభ్య మెసేజ్‌లు పెట్టడంతో పాటు ప్రేమించాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు.

ఈ క్రమంలో బుధవారం ఆ బాలిక నివాసం ఉంటున్న ప్లాట్‌కు మద్యం సేవించి వెళ్లిన రాఘవరావు మరోసారి ప్రేమ పేరుతో హల్‌ చల్‌ చేశాడు. ప్లాట్‌లో నుంచి బయటకు రావాలని ఆ బాలికను వేధించాడు. దీంతో ఆందోళనకు గురైన ఆ బాలిక స్నేహితులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు వారించే ప్రయత్నం చేశారు. అయితే వారిపైనా తిట్ల పురాణంతో బెదిరింపులకు దిగాడు.

రాఘవరావు వేధింపులపై మహిళా కమిషన్‌ సీరియస్‌
మైనర్‌ బాలికపట్ల జనసన నేత రాఘవరావు వేధింపులపై మహిళా కమిషన్‌ సీరియస్‌ అయ్యింది. అతనిపై కఠిన చర్యలు చేపట్టాలని విశాఖ పోలీస్‌ కమిషనర్‌ను మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ కోరారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వాసిరెడ్డి పద్మ భరోసా ఇచ్చారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top