Bihar Police Releases Video, Claims Katihar Protesters Shot By Unknown - Sakshi
Sakshi News home page

బీహార్ కాల్పుల ఘటనలో ట్విస్టు.. వీడియో సాక్ష్యం..  

Jul 29 2023 3:30 PM | Updated on Jul 29 2023 3:34 PM

Bihar Police Releases Video Claims Katihar Protesters Shot By Unknown - Sakshi

పాట్నా: బీహార్‌లో బుధవారం మెరుగైన విద్యుత్ సరాఫరా కోసం చేస్తోన్న ఆందోళనలో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో చనిపోయిన ఇద్దరు పోలీసుల కాల్పుల వలనే చనిపోయారంటూ వచ్చిన ఆరోపణలను తిప్పికొడుతూ అసలు నేరస్తుడి వీడియోను మీడియా ముందుంచారు కతిహార్ ఎస్పీ జితేంద్ర కుమార్. 

కతిహార్లో జరిగిన నిరసన కార్యక్రమంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా కొంతమంది విద్యుత్ శాఖ అధికారులు, మరికొంతమంది పోలీసులు గాయపడ్డారు. ఈ సంఘటనకు నితీష్ కుమార్ ప్రభుత్వ వైఫల్యమే కామరణమంటూ బీజేపీ వర్గాలు జేడీయు ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో దుయ్యబట్టాయి. ఇదిలా ఉండగా సంఘటనా స్థలంలో పోలీసులు చేసిన కాల్పుల వల్లనే ఇద్దరు చనిపోయారంటూ వచ్చిన విమర్శలకు స్పందిస్తూ ఎస్పీ అసలు నేరస్తుడు ఎవరనేది వీడియో సాక్ష్యంతో సహా బయటపెట్టారు. 

కతిహార్ ఎస్పీ జితేంద్ర కుమార్ మాట్లాడుతూ.. చనిపోయిన ఇద్దరు వ్యక్తులకు తగిలిన బుల్లెట్లు పోలీసులు కాల్చినవి కావు. పోలీసులు కాల్పులు చేసిన చోట నుండి ఫైరింగ్ జరిగితే బులెట్ గాయాలు వేరే చోట తగలాలి. ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తూ అక్కడి సీసీటీవీ ఫుటేజీని తెప్పించి చూస్తే అసలు విషయం బయటపడింది. ఓ వ్యక్తి మరో వైపు నుంచి వేగంగా వచ్చి తన వద్ద ఉన్న పిస్తోలు తీసి కాల్పుకు జరిపిన దృశ్యాలను మనం చూడవచ్చు అంటూ వీడియోను మీడియా ముందుంచారు.  

ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదు. పక్కా ప్రణాళిక ప్రకారమే హత్య జరిగిందని అన్నారు. ఈ సంఘటనలో ఖుర్షిద్ అలామ్ అక్కడికక్కడే చనిపోగా సోను కుమార్ సాహు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని మరో వ్యక్తి నియాజ్ అలామ్ మాత్రం ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడని అన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని తెలిపారు.    

ఇది కూడా చదవండి: మణిపూర్ మహిళల వీడియో కేసులో సీబీఐ ఎఫ్.ఐ.ఆర్ నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement