తండ్రి అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక 

15 year Girl Raped By father, Girl Pregnant - Sakshi

మోమిన్‌పేట: కంటికి రెప్పలా చూసుకోవలసిన కన్నతండ్రి కామాంధుడయ్యాడు. పదిహేనేళ్ల కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సదరు బాలిక గర్భం దాల్చింది. ఈ సంఘటన మోమిన్‌పేటలో బుధవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఓ కుటుంబం బతుకుతెరువు నిమిత్తం పటాన్‌చెరుకు వెళ్లింది. అక్కడ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.

ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు కాగా ఎనిమిదో తరగతి పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్న పెద్ద కుమార్తెపై తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. కూతురు కొద్ది రోజులుగా ఇబ్బందు లు పడుతుండటాన్ని గుర్తించిన తల్లి అసలు విషయం తెలియడంతో నిర్ఘాంతపోయింది. బుధవారం మోమిన్‌పేటకు చేరుకుని కామాంధుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top