శ్రీవారి దర్శనానికి 24 గంటలు | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 24 గంటలు

Jun 20 2026 12:13 AM | Updated on Jun 20 2026 12:13 AM

తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్‌ శిలాతరణం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 72,703 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 37,581 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.02 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.

నోటీసులు ఇవ్వాల్సింది మీకే

–వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి ద్రాక్షాయణి

పెనుమూరు(కార్వేటినగరం): గుడివాడ అమర్నాధ్‌కు నోటీసులు ఇవ్వడం కరెక్ట్‌ అయితే, ముందు గా కేసులు పెట్టాల్సింది.. నోటీసులు ఇవ్వాల్సింది మీకేనని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి ద్రాక్షాయణి మండిపడ్డారు. శుక్రవారం పెనుమూరు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసి న మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ఎలా ఉందంటే తిమ్మి ని బొమ్మను చేసినట్లు ఉందన్నారు. అధికార పక్షానికి ఒక చట్టం..ప్రతి పక్షానికి ఒక చట్టం ఉందా? అని ప్రశ్నించారు. హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివార అమర్నాద్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఉమెన్‌ కమిషన్‌ నోటీలు ఇచ్చిందన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమన్నారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి రాజకీయాలకు వచ్చిన వ్యక్తి ఎంతో హుందాతనంగా వ్యవహరించాలన్నారు. అలాంటిది ఒక మాజీ మంత్రిని ఒక కీలకమైన శాఖలో ఉన్న మీరు.. వాడు, వీడు అని అమర్యాదకరంగా మాట్లా డడం సమంజసమేనా అన్నారు. మీరు ఇప్పుడు కూడా ఉపాధ్యాయురాలిగా ఉండి ఉంటే పిల్లలకు ఇలాంటి మాటలే నేర్పేవారా? ప్రశ్నించారు. అలాగే జీడీ నెల్లూరు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కృపాలక్ష్మి మేకప్‌ వేసుకుని తిరుగుతుందని, ప్రస్తుత ఎమ్మెల్యే థామస్‌ విమర్శించినప్పుడు ఎందుకు కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని, ఎక్కడ చూసిన మహిళలపై లైంగికదాడులు జరుగుతున్నా.. ఒక మహిళ హోంమంత్రిగా ఉంటూ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement