నేడు విద్యుత్‌కు అంతరాయం | - | Sakshi
Sakshi News home page

నేడు విద్యుత్‌కు అంతరాయం

Apr 4 2026 7:43 AM | Updated on Apr 4 2026 7:43 AM

చిత్తూరు కార్పొరేషన్‌: స్థానిక రాములవారి గుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం పుష్ప పల్లకీ సేవ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఉంటుందని ట్రాన్స్‌కో సంతపేట ఏఈ ప్రసన్న తెలిపారు. బజారువీధి, శేషాపిరాన్‌వీధి, జెండామాను వీధి, డీఐరోడ్డు, ఓటీకే రోడ్డు, తోటపాళ్యం, గాంధీరోడ్డు, కై లాసపురం, ఇందిరానగర్‌ ప్రాంతాల్లో రాత్రి 7 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.

కాణిపాకంలో ఒడిశా హైకోర్టు న్యాయమూర్తి

కానిపాకం: కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని ఒడిశా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణ పట్నాయక్‌ కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలతో పాటు శేష వస్త్రం, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్‌ వాసు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ రవి, చిత్తూరు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

ఆరోగ్యశ్రీని

పునరుద్ధరించాలి

చిత్తూరు కార్పొరేషన్‌: ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు పునరుద్ధరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గంగరాజు శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులలో వైద్యసేవలు నిలిపివేయడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బకాయిలు వెంటనే విడుదల చేసి వైద్యసేవలు పునరుద్ధరించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ద్విచక్రవాహనం అదుపుతప్పి ఒకరి మృతి

– ఇద్దరికి తీవ్రగాయలు

శ్రీరంగరాజపురం : ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని ఉడమాలకుర్తి పంచాయతీ, కుశస్థలినది ఫ్లైఓవర్‌ వంతెనపై శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని పొదలపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య కూమారుడు సీ.కే.బాబు (34) పుత్తూరు మండలం, వేపగుంట గ్రామానికి చెందిన దోరస్వామి, అతని భర్య తేన్‌మాయిని కార్వేటినగరం మండలంలోని సమీప బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడ నుంచి మండలంలోని పొదలపల్లి గ్రామానికి సీ.కే.బాబు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా.. మార్గ మధ్యంలో ఉడమాలకుర్తి కుశస్థలి నది వంతెనపై అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో సీ.కే.బాబు అక్కడికిక్కడే మృతి చెందాడు. గాయపడిన దొరస్వామి, తేన్‌మాయిని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల పిర్యాధు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ సుమన్‌ తెలిపారు. మృతదేహాన్ని పో్‌స్ట్‌మార్టం నిమత్తం చిత్తూరు ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement