కలెక్టర్‌ ఆదేశించినా..! | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ ఆదేశించినా..!

Apr 4 2026 7:43 AM | Updated on Apr 4 2026 7:43 AM

● మూడు నెలలుగా అంగన్‌వాడీ హెల్పర్‌ను చేర్చుకోని పీడీ, సీడీపీఓ

గంగాధర నెల్లూరు : దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదంటే ఇదేనేమో. ఓ అంగన్‌వాడీ హెల్పర్‌ను విధుల్లోకి తీసుకోవాలంటూ పీడీని ఆదేశించినా సదరు అధికారిణితోపాటు సీడీపీఓ పట్టించుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ మేరకు శుక్రవారం ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. గంగాధరనెల్లూరు మండలంలోని తూగుండ్రం దళితవాడలోని అంగన్వాడీ కేంద్రంలో హెల్పర్‌గా సీత పనిచేస్తోంది. ఆమె అనారోగ్యం కారణంగా ఉద్యోగానికి రాలేకపోతున్నానని అక్కడి అంగన్‌వాడీ వర్కర్‌ గుణవతికి సమాచారం చేరవేసింది. ఆ తర్వాత సుమారు రెండు నెలలు అనంతరం విధుల్లోకి చేరడానికి హెల్పర్‌ అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లగా..వర్కర్‌ విధుల్లోకి చేర్చుకోలేదు. పలుమార్లు సీడీపీఓ, పీడీకి చెప్పినా పట్టించుకోలేదు. చివరగా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ను సంప్రదించగా.. ఆయన మానవతా దృక్పథంతో స్పందించారు. వెంటనే హెల్పర్‌ను విధుల్లోకి తీసుకోవాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీని ఆదేశించారు. కానీ పీడీతోపాటు జీడీనెల్లూరు సీడీపీఓ సైతం కలెక్టర్‌ ఆదేశాలను పట్టించుకోలేదు. దీంతో హెల్పర్‌ తన ఆవేదనను వీడియో ద్వారా తెలియజేయడంతో వైరల్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement