కార్వేటినగరం: ఏపీడీఈఈ సెట్‌కు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని డైట్ ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 2026కు సంబంధించిన డీఈఈసెట్ నోటీఫి కేషన్ విడుదల చేశారని, మార్చి 31 నుంచి దరకాస్తులు స్వీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలో విద్యాశిక్షణతో పాటు ప్రైవేటు ఎలిమెంటరీ ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఐఈడీ) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్–2026కు ఆశక్తి గల అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ట్లు హెచ్‌టీటీపీఎస్// సీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ లేదా హెచ్‌టీటీపీఎస్// ఏపీ డీఈఈసెట్.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్ ద్వారా దరకకాస్తులు చేసుకోవాలని సూచించారు. పరీక్ష రుసుము రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుందని, ఈ రుసుము మార్చి 31 నుంచి ఏప్రిల్ 15 మధ్య గేట్‌వే ద్వారా చెల్లించాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షల్లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు 45 శాతం ఉండాలని సూచించారు. అదే విధంగా 2026 సెప్టెంబర్ నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలని, గరిష్ట వయో పరిమితి లేదని పేర్కొన్నారు.
పరీక్ష విధానం
డీఈఈసెట్ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుందని, అందులో పార్ట్–ఎ 60 మార్కులు, పార్ట్–బీకి 40 మార్కులకు ఉంటుందని, ప్రశ్న పత్రం తెలుగు, ఉర్దూ, తమిళం, ఇంగ్లిష్ మాధ్యమాల్లో అభ్యర్థి ఎంచుకున్న దాని ప్రకారం ఉంటుందని చెప్పారు.
దరఖాస్తు ప్రక్రియ
అభ్యర్థులు మొదట వెబ్‌సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్‌లోడ్ చేసుకుని చదువుకోవాలి. ఫీజు చెల్లించిన తర్వాత వచ్చే జర్నల్ నంబర్ సహాయంతో ఆన్‌లైన్ దరకాస్తును పూర్తిచేయాలి. ఫొటో, సంతకం స్కాన్ చేసి (గరిష్టంగా 50 కేబీ లోపు) అప్‌లోడ్ చేయాలి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికార వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. లేదా హెల్ప్ లైన్ నంబర్ 7995869743ను సంప్రదించవచ్చునని ప్రిన్సిపాల్ తెలిపారు.


