లైంగికదాడి కేసులో 20 ఏళ్ల జైలు
చిత్తూరు అర్బన్: మైనర్ బాలికను ప్రేమ, పెళ్లి పేరిట మాయ మాటలు చెప్పి, ఆమైపె లైంగికదాడికి పాల్పడ్డ ఎస్.దిలీప్‌కుమార్ (40) అనే నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ చిత్తూరులోని పోక్సో కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహనకుమారి కథనం మేరకు.. గుడిపాల మండలం, అనుపుకు చెందిన దిలీప్‌కుమార్‌కు 14 ఏళ్ల మైన ర్ బాలిక పరిచయమైంది. ఆమెను ప్రేమిస్తున్నానంటూ నమ్మించి 2022 జనవరిలో బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఫిబ్రవరిలో బాలికను కర్ణాటక లోని బెంగళూరుకు తీ సుకెళ్లి, పెళ్లి పేరిట కొన్నాళ్లు కాపురం పెట్టాడు. తీరా బాలిక గర్భవతి కావడంతో.. పనులు దొర కలేదని చెప్పి ఆ ఏడాది డిసెంబర్‌లో ఆమెను తీసుకొచ్చి చిత్తూరు బస్టాండులో వదిలి వెళ్లిపోయాడు. జరిగిన విషయాన్ని బాలిక తన తండ్రికి చెప్పడంతో గుడిపాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.3 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఎం.శంకరరావు తీర్పు నిచ్చారు. బాధితురాలి కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలని న్యాయ స్థానం చిత్తూరు కలెక్టర్‌ను ఆదేశించింది.


