మల్బరీ ‘సిరి’టీ! | - | Sakshi
Sakshi News home page

మల్బరీ ‘సిరి’టీ!

Jan 31 2026 6:45 AM | Updated on Jan 31 2026 6:45 AM

మల్బరీ ‘సిరి’టీ!

మల్బరీ ‘సిరి’టీ!

● రైతుల నుంచి మల్బరీ పొడిని కొంటున్న వ్యాపారులు ● క్వింటాళ్‌ ధర రూ.6,300 దాకా విక్రయాలు ● ఆన్‌లైన్‌లో పది గ్రాముల ప్యాకెట్‌ రూ.170

సిరిచాయ్‌పొడి కోసం మల్బరీ ఆకు వినియోగం

పలమనేరు: జిల్లాలోనే మల్బరీ సాగులో చిత్తూరు ముందంజలో ఉంది. ఇక్కడి రైతు లు మల్బరీ ఆకును పెంచి దాన్ని పట్టుపురుగులకు మేతగా వాడుతుంటారు. అయితే ఇదంతా లేకుండా కేవలం తోటల్లోని మల్బ రీ ఆకును అమ్ముకోవడం, కొందరు దీన్ని పొడిగా చేసి విక్రయించండం ఇప్పుడిప్పు డే ఇక్కడ మొదలవుతోంది. కొందరు వ్యాపారులు రైతుల నుంచి మల్బరీ ఆకును కొని ప్రొసెసింగ్‌ యూనిట్లకు విక్రయించుకుంటున్నారు. మరి కొందరు స్వయంగా పొడిని తయారు చేస్తున్నారు. ప్రస్తుతం సిరిచాయ్‌ పేరిట టీ దుకాణాల్లో మల్బరీ చాయ్‌ ప్రాచుర్యంలోకి వస్తోంది. ప్రముఖ ఆన్‌లైన్‌ కంపెనీలు అమ్మకాలు చేస్తున్నాయి. దీన్ని సేవిస్తే ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయని స్థానికులు చెబుతున్నా రు. హిందూపూర్‌ ప్రాంతంలో ఇప్పటికే ఈ వ్యాపారం జోరందుకోగా ఇక్కడ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది.

పొడిని ఎలా చేస్తున్నారంటే...

తోటలోని నాణ్యమైన మల్బరీ కొమ్మలను కత్తిరించి చాప్‌కట్టర్‌ ద్వారా ముక్కలు చేసి నీడలో పట్టలపై నాలుగు రోజులపాటు ఆరబెడుతారు. ఆపై పొడిని సంచిలో నింపి విజయవాడలోని తయారీ యూనిట్లకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం క్వింటాళ్‌ పొడి ధర రూ.6,300 పలుకుతోంది. ఎకరానికి ఐదు టన్నుల పచ్చి మల్బరీ ఆకును ముక్క లు చేసి ఎండబెట్టాక టన్ను పొడి లభిస్తుంది. టన్ను ధర రూ.63గా ఉంది. కొందరు వ్యాపారులు పచ్చి ఆకును తోటల వద్ద కొ ని ప్రొసెసింగ్‌ చేసేవారికి విక్రయిస్తున్నా రు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కువగా వీ–1 రకం మల్బరీ సాగులో ఉంది. కానీ పొడిని కొనే కంపెనీలు పాత రకమైన ఎం–5 లేదా నాటి రకాల ఆకును ఎక్కువ ధరకు కొంటున్నాయి.

సిరిటీతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు

కప్పు వేడి నీటిలో మల్బరీ పొడిని పది నిమిషాలు నానబెట్టి ఆపై పొడిని పక్కకు తీసేసి అందులో తేనె, నిమ్మరసం వేసుకొని తాగుతున్నారు. దీని ద్వారా రక్తంలో చెక్కెర నియంత్రణ, కొలెస్టాల్‌ను అదుపుచేయడం, బరువు తగ్గడం లాంటి ఉపయోగాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

విజయవాడకు పంపుతున్నాం

నేను ఎన్నో ఏళ్లుగా పట్టుసాగు చేస్తు న్నా. గత కొంతకాలంలో మల్బరీ టీ పొడి ప్రాచుర్యంలోకి రావడంతో మల్బ రీ ఆకును పొడిచేసి ఎండబెట్టి విజయవాడలోని కంపెనీలకు విక్రయిస్తున్నా. క్వింటాళ్‌కు రూ.6,300 దాకా గిట్టుబాటవుతోంది. ధరలు పెరిగితే మంరింత లాభంగా ఉంటుంది. – గురుమూర్తి,

ఏడూరు, గంగవరం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement