హరిత పాఠశాలలకు 8 అవార్డులు
తిరుపతి అర్బన్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎనిమిది పాఠశాలలు గ్రీన్ స్కూల్ ప్రోగ్రామ్‌కు ఎంపిక కావడంతో ఆ స్కూళ్ల హెచ్‌ఎంలు న్యూఢిల్లీలో శుక్రవారం అవార్డులు అందుకున్నారు. వారితోపాటు ఏపీఎన్‌జీసీ జిల్లా సమన్వయకర్త బాలచైతన్యకు అవార్డు దక్కింది. న్యూఢిల్లీలోని ఇండియా హాబిటెట్ సెంటర్లలోని స్టెయిన్ ఆడిటోరియంలో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ డైరెక్టర్ సునీత అవార్డులను ప్రదానం చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గంగవరం మండలంలోని పత్తికొండ జెడ్పీ హైస్కూలు, బొమ్మసముద్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తరిగొండ జెడ్పీ హైస్కూల్, కరకంబాడి జెడ్పీ హైస్కూలు, వెదురుకుప్పం జెడ్పీ హైస్కూలు, పుత్తూరు బాలికల ఉన్నత పాఠశాల, ఆర్కేఎం పురం ఉన్నత పాఠశాల, చింతలపట్టడ ఉన్నత పాఠశాలకు హరిత అవార్డులు దక్కాయి. ఈ క్రమంలో తిరుపతి, చిత్తూరు జిల్లాల డీఈఓలు కేవీఎన్ కుమార్, రాజేంద్ర ప్రసాద్, సమగ్రశిక్ష ఏపీసీలు గౌరీశంకర్, వెంకటరమణతోపాటు పలువురు అవార్డు అందుకున్న వారిని అభినందించారు.
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. గురువారం అర్ధరాత్రి వరకు 61,315 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 22,076 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.76 కో ట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శ న టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇసర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.


