బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక
కుప్పం రూరల్: జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయం స్థాయి పోటీలకు బ్యాడ్మింటన్ జట్లను బుధవారం ఎంపిక చేసినట్లు బీసీఎన్ విద్యా సంస్థల అధినేత బీసీ నాగరాజు చెప్పారు. వర్సిటీ పరిధిలోని 22 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి 92 మంది క్రీడాకారులు పాల్గొన్నట్టు పేర్కొనానరు. పురుషుల జట్టు కింద ఏడుగురు ప్రధాన ఆటగాళ్లు, ఐదుగురుని స్టాండ్‌బైగా ఎంపిక చేసినట్లు చెప్పారు. మహిళా విభాగంలో ఐదుగురు ప్రధాన ఆటగాళ్లు, నలుగురుని స్టాండ్ బైగా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ సెలెక్షన్లలో కుప్పం ఇంజినీరింగ్ కళాశాల నుంచి ముగ్గురు ఎంపికై నట్టు పేర్కొన్నారు. ఎంపికై న ఆటగాళ్లు వచ్చే వారం జరిగే వర్సిటీ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. వర్సిటీ పరిశీలకులు టి.నారాయాణరెడ్డి, వైస్ చైర్మన్ డా.సునీల్‌రాజ్, ప్రిన్సిపల్ సుధాకర్‌బాబు, ఫిజికల్ డైరెక్టర్ సతీష్‌కుమార్ పాల్గొన్నారు.


