విద్యార్థులకు సేవాతత్వం ముఖ్యం
చిత్తూరు కలెక్టరేట్: విద్యార్థులకు సేవాతత్వం ముఖ్యమని సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మనోహర్ తెలిపారు. బుధవారం నగరంలోని వల్లియప్ప నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎన్‌ఎస్‌ఎస్ స్పెషల్ క్యాంప్ ప్రారంభించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థి దశలో సేవాభావంతో పనిచేసే ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని వెల్లడించారు. ఎన్‌ఎస్‌ఎస్‌వలంటీర్లు క్రమశిక్షణతో వారం రోజులపాటు స్పెషల్ క్యాంపులో పాల్గొని సేవలందించాలన్నారు. విభిన్న అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. స్పెషల్ క్యాంపులతో విద్యార్థులల్లో సమైక్యత భావం వస్తుందని తెలిపారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ షమ్స్ అక్తర్, వైస్ ప్రిన్సిపల్ ఉషారాణి పాల్గొన్నారు.
పసి పిల్లలపై లైంగిక దాడులు బాధాకరం
యాదమరి: పసి పిల్లలపై లైంగిక దాడులు జరుగుతుండటం అత్యంత బాధాకరమని జిల్లా న్యాయ సహకార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి భారతి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయం నందు మహిళల చట్టాలపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ..ప్రస్తుతం రోజురోజుకూ మహిళలు, బాలికలపై హింస, వేధింపులు పెరుగుతున్నాయని అన్నారు. చదువుకోవాల్సిన వయస్సులో తల్లిదండ్రులు బాల్య వివాహాలు జరిపిస్తున్నారని, దీని కారణంగా వారి ఆరోగ్యంతో పాటు బంగారు భవిష్యత్తును మొగ్గలోనే చిదిమేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, బాలికలకు భద్రత కల్పించే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వీరేంద్ర, ఏపీఎం ఈశ్వరి, నాయకులు పాల్గొన్నారు.
శ్రీవారి సేవలో ఉడిపి మఠం పీఠాధిపతి
తిరుమల: తిరుమలలోని శ్రీవారి బుధవారం ఉడిపిలోని సోడే వాదిరాజ మఠం పీఠాధిపతి విశ్వ వల్లభతీర్థ స్వామీజీ దర్శించుకున్నారు. తిరుమల బేడీ ఆంజనేయ స్వామి వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం, పోటు పేస్‌కార్ మునిరత్నం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
విద్యార్థులకు సేవాతత్వం ముఖ్యం
విద్యార్థులకు సేవాతత్వం ముఖ్యం


