జిల్లా స్థాయి బాల్‌బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు
వెదురుకుప్పం: మండలంలోని పచ్చికాపల్లం జెడ్పీ హైస్కూల్‌లో అండర్–14 జిల్లా స్థాయి బాల, బాలికల బాల్ బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు నిర్వహించినట్లు ఎంఈఓ దామోదరం తెలిపారు. ఈ పోటీలకు ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నట్లు చెప్పారు. కాగా బాలిక విభాగం నుంచి ఢిల్లీకళ్యాణి, దీపిక(నాగరాజకుప్పం), హిమజ, పూజిత(పచ్చికాపల్లం), జనని(తిరుమలయ్యపల్లె), జూలీ(జంబాడ), లక్ష్మీప్రియ( శ్రీకాళహస్తి), తేజస్విని(మంగళంట్రెండ్స్), రకియెకసూర్(మదనపల్లె), హేమ(మునగలపాళెం), బాలుర విభాగంలో... లక్ష్మీనరసింహారెడ్డి(నగరి), దిలీప్ (శ్రీకాళహస్తి), వెంకట్, మహేష్ (జంబాడ), పార్థీవ్ (శ్రీకాహస్తి), నితీన్ (జంబాడ), చరణ్(నాగరాజుకుప్పం), భరత్(శ్రీకాళహస్తి), హేమంత్(పచ్చికాపల్లం), అయాన్(బైరెడ్డిపల్లె) ఎంపికై నట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో ఎంపికై న విద్యార్థులు త్వరలో జరగబోవు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ ఎంపిక పోటీలు చెన్నకేశవులు, అన్సర్ బాషా, గోపి, లోకేష్, త్రిలోకసుందరి, జయచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించినట్లు చెప్పారు. ఎంపికై న విద్యార్థులకు ఎంఈఓ దామోదరం, ప్రధానోపాధ్యాయులు అశోక్ అభినందనలు తెలియజేశారు.


