పట్టు పురుగుల పెంపకంతో ఆదాయం
పుంగనూరు: మల్బరీ సాగు, పట్టు పురుగుల పెంపకంపై బుధవారం మండలంలోని వనమలదిన్నె సచివాలయంలో రైతులకు ఏఎస్‌ఓ అరుణ శిక్షణ ఇచ్చారు. పట్టు పురుగుల పెంపకానికి అవసరమైన షెడ్డు నిర్మించుకునేందుకు సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తామన్నారు. మల్బరీ సాగుతో సంవత్సరానికి రూ.3 లక్షలు ఆదాయం పొందవచ్చనని ఆమె పేర్కొన్నారు. రైతుల సందేహాలను ఆమె నివృత్తి చేశారు. కార్యక్రమంలో టీఏ నవీన్‌బాబు పాల్గొన్నారు.
గుడుపల్లెలో..
గుడుపల్లె: రైతులు మల్బరీ సాగు, పట్టు పురుగుల పెంపకంతో ఆదాయం పెంచుకోవచ్చని కుప్పం సెరికల్చర్ ఏడీ మోహన్‌బాబు అన్నారు. బుధవారం స్థానిక శ్రీశక్తి భవనంలో మండలంలోని రైతులకు పట్టు పురుగుల పెంపకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మల్బరీ సాగు చేసే రైతులకు కావలసిన పరికరాలు, పనిముట్లతో పాటు బ్లీచింగ్, సున్నం నేత్రికలు సబ్సిడీపై ఇస్తామన్నారు. అలాగే, షెడ్డు నిర్మాణానికి, మల్బరీ మొక్కలు నాటేందుకు ఉపాధి హామీ నిధులు ఇస్తామన్నారు.కార్యక్రమంలో నాయకులు, సెరికల్చర్ అధికారులు పాల్గొన్నారు.
పట్టు పురుగుల పెంపకంతో ఆదాయం


