అదరగొట్టిన అరగొండ ఆణిముత్యం
మన అమ్మాయే మిస్ ఆంధ్ర రన్నరప్
● 15 ఏళ్లకే రాష్ట్ర స్థాయిలో మెరిసిన బాలిక సహస్ర
తవణంపల్లె : మండలంలోని అరగొండకు చెందిన పల్లవి, శ్రీధర్ కుమార్తె సహస్ర 15 ఏళ్లకే పదో తరగతి చదువుకొంటూ.. టీనేజీ విభాగం అందాల పోటీల్లో మిస్ ఆంధ్ర రన్నరప్‌గా నిలిచి రాష్ట్ర స్థాయిలో అరగొండ పేరు ను నిలబెట్టింది. అరగొండకు చెందిన శ్రీధర్, భార్య పల్లవి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తూ బెంగుళూ రులో స్థిరపడ్డారు. తమ ఏకై క కుమార్తె సహస్ర బెంగుళూరులోని ఓర్‌కిడ్జ్ ఇంజర్‌నేషనల్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. సహస్రకు చిన్న నాటి నుంచి అందాల షోలో పాల్గొనడం, క్రికెట్‌తో పాటు డాన్స్‌పై మక్కువ. ఇంటర్ నేషనల్ స్కూల్లో అందాలు షోలు నిర్వహించి సహస్రను బాగా ప్రోత్సహించారు. దీంతో గత సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీ నుంచి బెంగుళూరులోని కర్ణాటక ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రికెట్ స్కూల్లో క్రికెట్ కోచింగ్ తీసుకుంటోంది. డాన్స్‌లోనూ రాణిస్తోంది. సహస్ర అభిరుచికి అనుగుణంగా ప్రోత్సాహం ఇవ్వడంతో రాష్ట్ర స్థాయిలో మిస్ ఆంధ్ర పోటీల్లో ద్వితీయ స్థానం సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చింది. క్రికెట్‌లోనూ మంచి కోచింగ్ తీసుకొని 15 సంవత్సరాలు తర్వాత జాతీయ స్థాయిలో రాణి స్తుందని తల్లిదండ్రులు ఆకాక్షించారు. ఓర్‌కిడ్జ్ ఇంజర్‌నేషనల్ స్కూల్లో నాణ్యమైన విద్య అందించడంతో పాటు అందాల షోలు నిర్వహించి ప్రోత్సహించడం వల్లే తమ కుమార్తె సహస్ర రాష్ట్ర స్థాయి పోటీల్లో స్థానం సంపాదించిందని వెల్లడించారు. చిత్తూరు జిల్లాలో పవి త్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అరగొండ పేరును రాష్ట్ర స్థాయిలో సహస్ర మారుమోగించడంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.


