చంద్రబాబు ప్రభుత్వం రైతులను విస్మరించింది
నగరి: చంద్రబాబు ప్రభుత్వం రైతులను పూర్తి గా విస్మరించిందని మాజీ మంత్రి ఆర్కేరోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. వరి రైతులు నిలదీస్తే మంత్రి పార్థసారథి ప్రస్టేషన్‌కు వెళ్లిపోయారన్నారు. జగనన్న పాలనలో రైతుల్ని కుటుంబ సభ్యులుగా చూసుకున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు వారానికి ఇద్దరు రైతులు చనిపోతున్నారని గుర్తుచేశారు. 18 నెలల కాలంలో 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు వెల్లడించారు. సీఎం, డిప్యూటీ సీఎం ప్రత్యేక హెలి కాప్టర్‌లలో జల్సాలు చేస్తూ విహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వరి, మామిడి, చెరు కు, ఉల్లి, పొగాకు, టమాట రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జ్యూస్ ఫ్యాక్టరీలు మామిడి రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా మోసం చేస్తుంటే వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నా రు. రైతులకు మేలు చేయని వారు పదవుల్లో ఉండడానికి అనర్హులని వారు వెంటనే రాజీనామా చేయాలన్నారు.
బోయకొండకు
పోటెత్తిన భక్తులు
చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో విద్యార్థులు, యువత, ఉద్యోగస్తులు కుటుంబ సమేతంగా హాజరై మొక్కులు చెల్లించారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. ఆలయ అర్చకులు అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కోర్కెలు తీరిన భక్తులు దీపాలు వెలిగించి, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. క్యూలెన్లలో భక్తుల రద్దీ కారణంగా స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. కొండపై చలి తీవ్రత అధికం కావడంతో వృద్ధులు, చిన్న పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆలయ ఈఓ ఏకాంబరం పర్యవేక్షణలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
చంద్రబాబు ప్రభుత్వం రైతులను విస్మరించింది


