ఎలా బతికేది తల్లీ? | - | Sakshi
Sakshi News home page

ఎలా బతికేది తల్లీ?

Dec 14 2025 8:35 AM | Updated on Dec 14 2025 8:35 AM

ఎలా బ

ఎలా బతికేది తల్లీ?

● జిల్లాకు చేరిన చింతూరు రోడ్డు ప్రమాద మృతదేహాలు ● కన్నీరుమున్నీరుగా విలపించిన బంధువులు ● ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి గాథ

● జిల్లాకు చేరిన చింతూరు రోడ్డు ప్రమాద మృతదేహాలు ● కన్నీరుమున్నీరుగా విలపించిన బంధువులు ● ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి గాథ

చిత్తూరురూరల్‌ (కాణిపాకం): ‘ఇన్నాళ్లు ఈ ఇంట్లో ఇద్దరే ఉన్నాం. ఇప్పుడు ఒక్కదాన్నే ఉండాలా..? యాత్రకు పోబుద్ధి లేదన్నావే. అందరొచ్చారు..లేవ య్యా’ అంటూ మృతుడు నాగేశ్వరరావు భార్య అముల్‌ రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. శుక్రవారం వేకువజామున చింతూరులో జరిగిన ఘూర రోడ్డు ప్రమాదంలో చిత్తూ రు నగరానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. అందులో నాగేశ్వరరావు (68), శ్రీకళాదేవి (64), శ్యామల(67) ఉన్నారు. అలాగే తవణంపల్లి మండలం, నారసింహనపల్లెకు చెందిన దొరబాబు(37)కూడా మృతిచెందారు. ఈ మృతదేహాలు శనివారం మధ్యాహ్నం ఆయా ప్రాంతాలకు చేరుకున్నాయి.

ఒంటరిదాన్ని చేశావయ్యా!

చిత్తూరు నగరం, గిరింపేటలోని మరాఠి వీధికి చెందిన నాగేశ్వరరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన మృతదేహం చింతూరు నుంచి మధ్యా హ్నం 3.15 గంటలకు ఇంటికి చేరింది. దీంతో మరాఠివీధిలో విషాదఛాయలు అలముకున్నాయి. బంధువులు, కుటుంబీకులతో ఇంటివద్ద ఆర్తనాదాలు మిన్నంటాయి. భర్త మృతదేహం వద్ద భార్య అముల్‌భాయ్‌ గుండెలు బాదుకుంటూ రోదించడం అందరినీ కలచివేసింది. ఇన్నాళ్లు ఇద్దరున్నాం.. ఇప్పుడు ఒంటరిదాన్ని చేశావంటూ ఆమె రోదించిన తీరు గుండెలు బరువెక్కేలా చేసింది. అనంతరం 4.30 గంటలకు అంత్యక్రియలు పూర్తిచేశారు.

కొలిచి..గుండెలవిసి!

మరాఠివీధిలోని నాగేశ్వరరావు, అముల్‌భాయ్‌ ఆ ధ్యాత్మిక దంపతులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరూ కలిసి సకలదేవతలను పూజించేశారు. ని త్యం పూజలు చేస్తూ గడిపేవారు. దేవుడంటే అపారమైన భక్తి. ఎక్కడ పూజలు జరిగినా ముందు వరుసలో నిలిచేవాళ్లు. ఆ చింతన అయ్యప్పస్వామి భక్త భజన మండలిలో వీళ్లకు సభ్యులుగా అవకాశం క ల్పించారు. దుర్గానగర్‌ కాలనీలో జరిగే అయ్యప్పస్వామి భజన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేవా రని ఆ వీధిలోని వారు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

చిత్తూరు ఆస్పత్రిలో శ్రీకళాదేవి మృతదేహం

చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో శ్రీకళాదేవి మృతదేహాన్ని భద్రపరిచారు. ఆమె మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. కొడుకు భసవంత్‌రెడ్డి శనివా రం యూఎస్‌ఏ నుంచి స్వదేశం రానున్నారు. ఆదివారం వేకువజామున రెండు గంటలకు చిత్తూరుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అంత్యక్రియలు చేయనున్నట్టు ఆమె బంధువులు పేర్కొన్నారు.

శ్యామలకు తుది వీడ్కోలు

చిత్తూరు కార్పొరేషన్‌: చింతూరు రోడ్డు ప్రమాదంలో మరణించిన చిత్తూరుకు చెందిన ట్రాన్స్‌కో విశ్రాంత ఉద్యోగి శ్యామల(67)కు శనివారం తుది వీడ్కోలు పలికారు. మధ్యాహ్నం అక్కడి నుంచి స్థానిక కొంగారెడ్డిపల్లెలో ఆమె తమ్ముడు విశ్రాంత ఎస్‌ఐ సదాశివంరెడ్డి నివాసం వద్దకు పార్థివదేహాన్ని తీసుకొచ్చారు. శ్యామల కుమారుడు ప్రసాద్‌, ఆయన భార్య సరిత, కూతురు నీలిమ, మనవరాళ్లు యుక్త, ముక్త, దీక్షిత ఆమెను చూసి ఏడ్చేశారు. టూరుకు వెళ్లకపోయినా బాగుండేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమెతో ఉన్న అనుభవాలను నెమరువేసుకున్నారు. పర్యాటకాన్ని ఇష్టపడే శ్యామల గత నెలలో నీలిమ, దీక్షితతో కలిసి సింగపూర్‌కు వెళ్లినట్లు సీనియర్‌ విశ్రాంత ఉద్యోగి ప్రసాద్‌ గుర్తుచేసుకున్నారు. శ్యామల అన్నలు రామ్‌కుమార్‌రెడ్డి, సదాశివంరెడ్డి, వదినలు పుష్పలత, సంపూర్ణమ్మ ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని బాధపడ్డారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన

భార్యాభర్తలు సునంద, శివశంకర్‌రెడ్డి (ఫైల్‌)

సంతాపం

మృతురాలు శ్యామలకు వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి మాట్లాడి సంతాపం తెలిపారు. ఘటన జరగడం బాధాకరమన్నారు. ఆ పార్టీ ఉద్యోగుల, పెన్షన్సర్‌ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి, ట్రాన్స్‌కో అధికారులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్ని శ్రద్ధాంజలి ఘటించారు.

అప్పుడే వెళ్లిపోయావా ‘దొర’!

తవణంపల్లె: ‘రుచికరమైన వంటలు చేసి అందరి మనసు దోచుకున్నావు. భార్యా, బిడ్డలకు కూడా లోటులేకుండా చూసుకున్నావు. ఇప్పుడు హఠాత్తుగా మమ్మల్ని వదిలివెళ్లావు. మాకె దిక్కెవరు స్వామీ’ అంటూ మండలంలోని నారసింహనపల్లెకు చెందిన దొరబాబు మృతదేహం వద్ద భార్య, బిడ్డలు రోదించిన తీరు కంటతడి పెట్టించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు– మారేడుమిల్లి ఘాట్‌ రోడ్డు, రాజుగారిమెట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నారసింహనపల్లెకు చెందిన దొరబాబు(37) మృతిచెందారు. ఆయన వంట మాస్టర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవారు. మృతునికి భార్య సుమలత, కుమార్తెలు పావని, మౌనిక, కుమారుడు మోహన్‌కృష్ణ ఉన్నారు. తన తండ్రి మృతదేహం వద్ద పిల్లలు రోదిస్తూ.. ఆర్తనాదాలు పెట్టడం గుండెల్ని మెలిపెట్టింది. ‘నా పిల్లలకు తండ్రిని దూరం చేశావా..దేవుడా..! ఇక మా కు దిక్కెవరు స్వామీ’ అంటూ మృతుని భార్య గుండెలు బాదుకుంటూ రోదించడం చూపరులను కంటతడి పెట్టించింది. అనంతరం దొరబాబు మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఎలా బతికేది తల్లీ? 
1
1/3

ఎలా బతికేది తల్లీ?

ఎలా బతికేది తల్లీ? 
2
2/3

ఎలా బతికేది తల్లీ?

ఎలా బతికేది తల్లీ? 
3
3/3

ఎలా బతికేది తల్లీ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement