17న మొగిలిలో తలనీలాల పోగు వేలం
బంగారుపాళెం: మండలంలోని మొగిలీశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 17న తలనీలాలు పోగు చేసుకునే హక్కుకు సంబంధించి బహి రంగ వేలం నిర్వహించనున్నటు ఈఓ ముని రాజ శనివారం తెలిపారు. ఆలయం ఆవరణ లో ఉదయం 10.30 గంటలకు దేవదాయశాఖ అధికారుల సమక్షంలో బహిరంగ వేలం ఉంటుందన్నారు. వేలం పాటలో పాల్గొనదలచిన వారు రూ.10 వేలు ఽడిపాజిట్ చెల్లించి పాల్గొనాలని సూచించారు. వివరాలకు కార్యాయలయంలో అధికారులను సంప్రదించాలని కోరారు.
ఓపెన్ చెస్ టోర్నీ
పోస్టర్ ఆవిష్కరణ
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ టోర్నీ పోస్టర్‌ను ఆంధ్ర చెస్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌ఆర్‌బీ ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ మేరకు శనివారం ఆ సంఘం జిల్లా కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న చిత్తూరులో రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ టోర్నీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ టోర్నీలో గెలుపొందే విజేతలకు రూ.1.29 లక్షల విలువ గల నగదు బహుమతులను అందించనున్నట్లు చెప్పారు. పేర్ల నమోదుకు 98493 13676, 90004 75799ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో సభ్యులు దినేష్, గిరిధర్, కృష్ణకిశోర్, మల్లికార్జున పాల్గొన్నారు.
గ్రేడ్ 2 నుంచి
జేఎల్‌ఎంలుగా మార్పు
చిత్తూరు కార్పొరేషన్: సచివాలయ పరిధిలో పనిచేస్తున్న జేఎల్‌ఎం గ్రేడ్–2ను పోస్టులను జేఎల్‌ఎంలుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు సచివాలయ పరిధిలో అందుబాటులో ఉంటూ సంబంఽధిత ట్రాన్స్‌కో సెక్షన్ పరిధిలో విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తున్నారు. జిల్లాలో మొత్తం 285 మంది ఉండగా వీరికి జేఎల్‌ఎం గ్రేడ్–2 హోదా ప్రకారం బేసిక్ పే రూ.23,780 చొప్పున జీతాలు ఇస్తున్నారు. ప్రస్తుతం వారిని జేఎల్‌ఎంలుగా గుర్తించడంతో రూ.30,800 చొప్పున జీతం ఇవ్వనున్నారు. ఇక వీరికి ట్రాన్స్‌కో ఉద్యోగులు విధివిధానాలు వర్తించనున్నాయి.
‘విశ్వం’కు బెస్ట్ స్కూల్
ఎక్సలెన్స్ అవార్డు
తిరుపతి సిటీ: హైదరాబాద్ వేదికగా ఇటీవల 2025– 26 విద్యా సంవత్సరానికి గాను తిరుపతి విశ్వం టాలెంట్ స్కూల్‌కు ‘‘బెస్ట్ అకడమిక్ ఎక్సలెన్‌న్స్ స్కూల్’’, ‘‘బెస్ట్ ఇన్‌న్‌ఫ్రాస్ట్రక్చర్ స్కూల్’ అవార్డులు సొంతం చేసుకుంది. విశ్వం విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ విశ్వనాథ్ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ ఎన్ విశ్వచందన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విశ్వం పాఠశాలలో నాణ్యత, నవీన బోధనా విధానాలు, ఆధునిక మౌలిక సదుపాయాలతో రాజీలేకుండా విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. ప్రత్యేకంగా సైనిక్ స్కూల్, జవహర్ నవోదయ విద్యాలయాలు, మిలిటరీ స్కూల్స్ ప్రవేశ పరీక్షలకు సమగ్ర శిక్షణ అందిస్తూ, విద్యార్థులను చిన్న వయసు నుంచే క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి భావాలను అలవరుస్తున్నట్లు పేర్కొన్నారు.
17న మొగిలిలో తలనీలాల పోగు వేలం


