వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
పులిచెర్ల(కల్లూరు) : మండలంలోని మంగళంపేట హైస్కూల్‌ను శనివారం కడప రీజనల్ జాయింట్ డైరెక్టరు శామ్యూల్ తనిఖీ చేశారు. పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మేటివ్ అసెస్‌మెంట్–1 వంద రోజుల ప్రణాళిక పరీక్షలను పరిశీలించారు. ఉత్తమ మార్కులు సాధించిన మల్లేష్, ఆలియాతాజ్‌మిన్ ను అభినందించారు. అనంతరం పాఠశాలలో గ్రీనరీ, ఆర్వోసిస్టం, విద్యార్థుల మరుగుదొడ్లను తనిఖీ చేశారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఎంఈఓలు సిద్ధరామయ్య, పోకల తాతయ్య, హెచ్‌ఎం ఫజురుల్లా పాల్గొన్నారు.


