8న బోయకొండలో హుండీ కానుకల లెక్కింపు
చౌడేపల్లె : పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఈనెల 8వ తేదీ సోమవారం హుండీ కానుకలు లెక్కింపు చేపట్టనున్నట్లు ఆలయ ఈఓ ఏకాంబరం ఒక ప్రకటనలో తెలిపారు. లెక్కింపు కార్యక్రమానికి ఆలయ, బ్యాంకు, పోలీసు సిబ్బంది హాజరు కావాలని కోరారు.
రాహుకాల పూజలు
చౌడేపల్లె : బోయకొండ గంగమ్మకు శుక్రవారం రాహుకాల పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించా రు. రాహుకాల సమ యం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు సంప్రదాయ రీతిలో అర్చనలు, అభిషేకాలు చేశా రు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఉభయ దారులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, భక్తుల కు ఉచిత అన్న ప్రసాదం పంపిణీ చేశారు.
వైఎస్సార్‌సీపీలో
కార్యదర్శుల నియామకం
చిత్తూరు కార్పొరేషన్: వైఎస్సార్‌సీపీలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శులను నియమిస్తూ ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం వివరాలను ప్రకటించింది. జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన సోమేశ్వరప్రభునాయుడు, కుప్పం నియోజకవర్గానికి చెందిన చక్రపాణిరెడ్డిని నియమించారు.
ఎస్టీయూ కౌన్సిల్ సమావేశం జయప్రదం చేయండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలో ఈనెల 7వ తేదీ ఆదివారం నిర్వహించే ఎస్టీయూ జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మదన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సుందరరాజపురంలోని విజయం విద్యాసంస్థల్లో నిర్వహించనున్న ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలకు పైగా అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడం దారుణమని విమర్శించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్‌యాదవ్ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న టీచర్ల సమస్యలు, 12వ పీఆర్‌సీ నియామకం వెంటనే పూర్తి చేయాలన్నారు. 30 శాతం మధ్యంతర భృతి, ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన రూ.30 వేల కోట్ల ఆర్థిక బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
8న ధర్మకర్త
మండలి సమావేశం
కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినా యకస్వామి దేవస్థాన ధర్మకర్త మండలి సమావేశం ఈనెల 8వ తేదీ సోమవారం జరగనున్న ట్లు ఈఓ పెంచల కిషోర్ తెలిపారు. ఈఓ కార్యా లయ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు మండలి సమావేశం ప్రారంభమవుతుందన్నారు. ఇందుకు సభ్యులు హాజరు కావాలని పేర్కొన్నారు.


