ఎక్కువగా మదపుటేనుగులే..
పలమనేరు, కుప్పం, చిత్తూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని కౌండిన్య అభయారణ్యంతో పాటు తమిళనాడులోని మోర్థన ప్రాంతం, క్రిష్ణగిరి, ధర్మపురి, కావేరిపట్నం , కర్ణాటకలోని హొసూర్, బన్నేర్‌గుట్టల నుంచి తరచుగా కౌండిన్యలోకి ప్రవేశించే సంచార ఏనుగులున్నాయి. వీటిల్లో 21 ఏనుగులు వివిధ కారణాలతో మృతి చెందాయి. గత పదేళ్లలో కరెంట్ షాక్‌లతో 15 ఏనుగులు మృతి చెందాయి. మిగిలిన వాటిల్లో మూడు మొగిలి ఘాట్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాయి. మరో రెండు మదపు టేనుగుల దాడులతో పాడుబడిన బావుల్లో పడడంతో చనిపోయాయి. ముఖ్యంగా ఏనుగులకు కరెంట్ శత్రువులా మారింది. మేతకోసం అడవిని దాటి పంటలపైకొచ్చే ఏనుగులు ఎక్కువగా కరెంట్ షాక్‌లతో మృతి చెందుతున్నాయి.


