జగన్ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి
– మాజీ ఉప ముఖ్యమంత్రి
నారాయణస్వామి డిమాండ్
వెదురుకుప్పం: ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం గడిచిన 18 నెలల్లో పాలనను గాలికొదిలేసి ప్రతిపక్షంపై కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి విమర్శించారు. బాబు సర్కార్ అస్తవ్యస్త పాలనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంధించిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పుత్తూరులోని శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, శ్రీసూపర్‌సిక్స్ మోసాల్లో భాగంగా ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని గొంతు నొక్కాలని ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోంది. రాష్ట్రంలో పేదలు, రైతులు, మధ్య తరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులకు జరుగుతున్న అన్యాయాలను జగన్ కూలంకుశంగా వివరిస్తూ మీడియా ద్వారా ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాజకీయ స్వలాభం కోసమే తిరుమల లడ్డూపై లేనిపోని వివాదాలు సృష్టించి రాద్దాంతం చేస్తున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వేంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. అలాంటి వ్యక్తిపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సమంజసం కాదు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు. పేదల సంక్షేమాన్ని తన బాధ్యతగా అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అనేక పథకాలను అమలు చేశారు. వారి ఆరోగ్యమే ధ్యేయంగా రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు. వీటిని ప్రైవేటు పరం చేసి చంద్రబాబు ప్రభుత్వం కోటీశ్వరులకు కొమ్ముకాస్తోందిశ్రీ అని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ సీఎం జగన్ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చినట్లు వివరించారు.ఇప్పటికైనా ప్రైవేటీకరణ విదానాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.


