29 నుంచి స్టేట్‌ బేస్‌బాల్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

29 నుంచి స్టేట్‌ బేస్‌బాల్‌ పోటీలు

Nov 28 2025 8:35 AM | Updated on Nov 28 2025 8:35 AM

29 నుంచి  స్టేట్‌ బేస్‌బాల్‌ పోటీలు

29 నుంచి స్టేట్‌ బేస్‌బాల్‌ పోటీలు

పలమనేరు: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 29 నుంచి అండర్‌–14 బాల, బాలికల రాష్ట్ర స్థాయి బేస్‌బాల్‌ పోటీలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు బాబు గురువారం తెలిపారు. ఆ మేరకు డిగ్రీ కళాశాల మైదానంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ పోటీల్లో రాష్ట్రంలోని 400 మందికిపైగా క్రీడాకారులు పాల్గొంటారన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు చెప్పారు.

29న సీతమ్స్‌లో

మెగా ఉద్యోగ మేళా

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా కేంద్రానికి సమీపం మురకంబట్టు వద్ద ఉన్న సీతమ్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈ నెల 29న మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి గుణశేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం విలేకరులతో మా ట్లాడారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీతమ్స్‌ మేజిక్‌ బస్సు ఇండియా ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్న ట్లు తెలిపారు. ఈ ఉద్యోగ మేళాలో పలు బహు ళ జాతీయ కంపెనీలు పాల్గొంటాయన్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్‌, పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉద్యోగమేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలని ఆయన వెల్లడించారు.

సివిల్‌ సర్వీసెస్‌కు

ఉచిత శిక్షణ

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులకు యూపీపీఎస్‌సీ సివిల్‌ సర్వీసెస్‌కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు జిల్లా బీసీ సంక్షేమ శాఖ డీడీ రబ్బానీబాషా అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. యూపీపీఎస్‌సీ నిర్వహించే సివిల్స్‌ ప్రిలిమనరీ, మెయిన్స్‌ పరీక్షలకు జిల్లాలో అర్హత ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తారన్నారు. అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికయ్యే అభ్యర్థులకు ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని బీసీ భవన్‌లో ఉచితంగా శిక్షణ ఇస్తారని తెలిపారు. దరఖాస్తులను కలెక్టరేట్‌లోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఇతర వివరాలకు 9177429494, 8520004646 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

జిల్లాలో రెండు రోజుల పాటు

వర్షాలు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ నుంచి సమాచారం అందినట్లు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. ఈ మేరకు శ్రీలంక తీరంలో బలపడుతున్న తీవ్ర వాయుగుండం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వెల్లడించారు. వర్షాల వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు సహాయక చర్యలకు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ తెలిపారు.

‘అదిగో అక్కడో కంపెనీ. సుబ్రమణ్యం అనే వ్యక్తి యజమాని. 30 మంది పనిచేసే ఆ కంపెనీలో ఏటా రూ.20 కోట్ల టర్నోవర్‌. ఏడాది గడిచాక ఎలాంటి లావాదేవీలు జరగలేదు. తప్పుడు బిల్లులతో ఐటీసీ కొట్టేశారని గుర్తించి రూ.12 కోట్లు జరిమానా చెల్లించాలంటూ షోకాజ్‌ నోటీసులు. క్షేత్ర స్థాయిలో విచారిస్తే సుబ్రమణ్యం రోడ్డుపై తోపుడు బండిలో టమాటాలు అమ్ముకునే వ్యక్తి.’ చిత్తూరు నగరంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అధికారుల నిర్లక్ష్యానికి.. ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి రూ.కోట్లు కొల్లగొడుతున్న క్రిమినల్స్‌ తెలితేటలకు అద్దం పడుతోంది. ఇలాంటి ఘటనలు జిల్లాలో కుప్పలు తెప్పలుగా వెలుగులోకి వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement