మేమున్నామని!
చౌడేపల్లె: గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలు, నాయ కులు, ప్రజలు బాబు ప్రభుత్వ కుట్రలకు భయపడొద్దు. ఎవరికి ఏ కష్టమొచ్చినా మేమున్నాంఅని రాజంపేట ఎంపీ పీవీ.మిథున్‌రెడ్డి భరోసానిచ్చారు. గురువారం మదనపల్లె పట్టణంలోని దేవతా నగర్‌లో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధా న కార్యదర్శి మిద్దింటి కిషోర్‌బాబు ను మదనపల్లె మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి, పార్టీ సమన్వయకర్త నిసార్ అహమ్మద్, మున్సిపల్ చైర్మన్ మనూజారెడ్డి, వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతితో కలిసి పరామర్శించారు. కిషోర్‌బాబుకు ఇటీవల బైక్ ప్రమాదంలో కుడికాలు విరిగింది. చికిత్సలనంత రం ఇంటికి వచ్చారు. విషయం తెలుసుకున్న మిథున్‌రెడ్డి అతని ఇంటికి వెళ్లి ఆరోగ్యపరిస్థితులపై ఆరాతీశారు. అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆయన వెంట మైనారిటీ నాయకుడు అమ్ము, మదనపల్లె జెడ్పీటీసీ సభ్యుడు ఉదయ్‌కుమార్, నాయకులు కేశవరెడ్డి, మహేష్‌బాబు, వలసపల్లి నాగరాజరెడ్డి, ఖాదర్, సుగుణ, ఆంజనేయులు, రేవతి తదితరులు పాల్గొన్నారు.


