మెడికల్ కళాశాలలపై బాబు కుట్ర
పుత్తూరు: రాష్ట్రంలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలపై.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి ఆర్కేరోజా ఆరోపించారు. పుత్తూరు మండలంలోని గొల్లపల్లి గ్రామంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్ జగన్‌హన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు గురువారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయకులతో పాటు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సంతకాలను సేకరించారు. ఆమె మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి తీసుకువచ్చిన మెడికల్ కళాశాలలను కావాలనే చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలతో ఎంతో మంది పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందని వాపోయారు. వైద్య విద్య అనేది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనికి వెళ్లిపోతే పేద విద్యార్థులు ఎలా చదువుకుంటారని, మధ్య తరగతి ప్రజలకు వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఇప్పటికై నా ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. యువత, విద్యార్థులు ఆలోచన చేసి రాజకీయాలకు అతీతంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఈ ప్రజా ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. నాయకులు శ్రీనివాసులురెడ్డి, మునస్వామిరెడ్డి, దిలీప్ మొదలి, అన్నాలోకనాథం, లక్షణమూర్తి, దేవేందర్‌రెడ్డి, గోవిందస్వామిరెడ్డి, ఉదయ్, రామ్‌భత్తయ్య, మస్తాన్ పాల్గొన్నారు.


