అమ్మ దొంగా!
పసిగట్టిన పాండిచ్చేరి పోలీసులు
రూ.7 లక్షల నగదు, 48 గ్రాముల
బంగారం స్వాధీనం
పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
కుప్పం: దొంగలు కొత్త రూటు ఎంచుకున్నారు. పొరుగునే ఉన్న పాండిచ్చేరిలో దొంగతనం చేసి అక్కడి నుంచి కుప్పం వచ్చి నివాసం ఉండడం అలవాటు చేసుకున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారి బండారాన్ని అక్కడి పోలీసులు బయటపెట్టా రు. స్థానికులు, పోలీసుల కథనం.. కుప్పం మండలం, మల్లానూరు గ్రామానికి చెందిన తిరుమలేష్, వళ్లెమ్మ, శారద కొత్త ఇండ్లు గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. గత మూడు నెలలుగా అక్కడే జీవనం సాగిస్తుండేవారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం పాండిచ్చేరి పోలీసులు ఆకస్మికంగా గ్రామంలో తనిఖీలు చేపట్టారు. తిరుమలేష్ అద్దెకున్న ఇంట్లో రూ.7 లక్షల నగద, 48 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. పాండిచ్చేరి పట్టణంలోని ఓ ఇంట్లో 224 గ్రాముల బంగారు ఆభరణాలు, లక్షా పది వేల రూపాయల నగదు దొగతనం జరిగింది. అక్కడికి కూలి పనులకు వెళ్లి తరుచూ తరుమలేష్ కుటుంబం దొంగతనాలకు పాల్పడి.. కుప్పంలోకి వచ్చి తలదాచుకునేది. బాధితుల ఫిర్యాదు మేరకు సెల్ ఫోన్ నంబర్ల ఆధారంగా దొంగలను పట్టుకున్నారు. తిరుమలేష్, వళ్లెమ్మ, శారదను అదుపులోకి తీసుకు ని పాండిచ్చేరికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా కొంత గందరగోళం నెలకొంది.
పాండిచ్చేరిలో చోరీ..
కుప్పంలో మకాం!


