కారును ఢీకొన్న బస్సు.. ఐదుగురికి గాయాలు
పుత్తూరు: మండలంలోని పరమేశ్వరమంగళం వద్ద బుధవారం కారును బస్సు ఢీకొన్న ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రం కంచి పట్టణానికి చెందిన ఐదుగురు కారులో శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో పరమేశ్వరమంగళం వద్ద తిరుపతికి వెళుతుండగా వారి కారును చైన్నె ప్రభుత్వ బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మలర్‌నిది(47), పన్నీర్‌సెల్వం(74), లక్ష్మి(68), రాహుల్(32), డ్రైవర్ కుమారగణేశన్(48) గాయపడ్డారు. వీరికి పుత్తూరులో ప్రథమ చికిత్స అనంతరం కంచికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


