వ్యాధులు.. టీకాలు ఇలా...
● ప్రసవం నుంచి 24 గంటలలోపు టీబీ, జాండిస్ నుంచి రక్షణకు బీసీసీ, పోలియో, నివారణకు ఓపీవీ 0 డోసు, కామెర్ల వ్యాధి అరికట్టేందుకు హెపటైటిస్ టీకాలు వేయాల్సి ఉంది.
● 45 రోజులకు పోలియో నివారణకు ఓపీవీ–1, ఓపీవీ–2, ఓపీవీ–3, ఐపీవీ
● 75 రోజులకు కంఠ సర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం, మెదడువాపు, న్యుమోనియా నివారణకు పెంటా–1, 2, 3 టీకాలు వేయాల్సి ఉంది.
● 105 రోజులకు తీవ్ర నీళ్ల విరోచనాలు, వాంతులు, జ్వరం, కడుపునొప్పి, మూత్ర విసర్జన, బరువు తగ్గడం వంటి నివారణకు ఆర్వీవీ–1, 2, 3 టీకాలు వేయాలి.
● 9–12 నెలల మధ్య తట్టు, రుబెల్లా వ్యాధుల నివారణకు ఎంఆర్–1, అంధత్వ నివారణకు విటమిన్–ఏ, మెదడువాపు నివారణకు జేఈ–1, దగ్గు, జ్వరం, శ్వాసలో ఇబ్బందుల నివారణకు ఎఫెవీవీ–3, అంధత్వ నివారణకు విటమిన్–22 టీకాలు వేయాల్సి ఉంది.
● 5–6 సంవత్సరాల మధ్య కంఠ సర్పి, కోరింత దగ్గు, ధనుర్వాతం నివారణకు డీపీటీ–2 వేయాల్సి ఉంది. అయితే ఈ మేరకు టీకాలు వేయడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


