అక్రమ గ్రానైట్‌పై కొరడా?
మైనింగ్ మాఫియాపై ‘సాక్షి’ వరుస కథనాలు సీఎంఓ ఆఫీసు నుంచి ఆరా అక్రమాలకు కొమ్ముకాస్తున్న ఓ అధికారిపై గురి కప్పిపుచ్చే ప్రయత్నంలో కార్యాలయ సిబ్బంది త్వరలో కార్యాలయంలో మార్పులు... చేర్పులు!
సాక్షి టాస్క్‌ఫోర్స్: జిల్లాలో అక్రమ గ్రానైట్‌పై బాబు స్పందించింది. దొంగ బిల్లులతో ఖనిజాన్ని లూటీ చేస్తున్న వైనంపై ఆరా తీస్తోంది. గతంలో అక్రమ గ్రానైట్‌పై సాక్షి దినపత్రిక వరుస కథనాలు ప్రచురించింది. గ్రానైట్ దందా గుట్టు రట్టు చేసింది. దీనిపై సీఎంఓ ఆఫీసు స్పందించింది. అక్రమ గ్రానైట్‌పై విచారణ చేపడుతోంది. తర్వలో కార్యాలయంలో మార్పులు, చేర్పులు ఉండనున్నట్టు సమాచారం.
బాబు ప్రభుత్వం వచ్చాక జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. అనుమతులు లేకుండా విచ్చలవిడిగా గుట్టలు, కొండలను తవ్వేసింది. ఆ పార్టీ నేతలే మాఫియాగా తయారై.. దందాకు పాల్పడుతున్నారు. చిత్తూరు, పూతలపట్టు, జీడీనెల్లూరు, యాదమరి, బంగారుపాళ్యం, ఎస్‌ఆర్‌పురం, కార్వేటినగరం, వెదురుకుప్పం, పాలసముద్రం, కుప్పం తదితర ప్రాంతాల్లో ఈ అక్రమ మైనింగ్ దర్జాగా నడిపిస్తున్నారు. దీనికితోడు రాయల్టీ వసూళ్ల పెత్తనం టీడీపీ నేతల చేతుల్లోకి చేరింది. గ్రానైట్ అసోసియేషన్ పేరు తో దొంగ బిల్లులు సృష్టించి వసూళ్లకు తెరలేపారు. బండిబండికీ కాపు కాచి వసూళ్లు చేస్తున్నారు. ఈ దొంగబిల్లుల బాగోతం బట్టబయలు కావడంతో.. దొంగ బిల్లుల సృష్టికర్త తోకముడిచాడు. ఇక గంగాధరనెల్లూరు నియోజవర్గం, యాదమరి మండలంలో ఈ దందా ఇంకా నడుస్తోంది. యాదమరి మండలంలోని దాసరపల్లిలో బినామీ పేరుతో అక్రమ క్వారీ నడుస్తోంది. ఈ మండల సరిహద్దులో మరో క్వారీ రెచ్చిపోతోంది. దీనిపై అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ అక్రమాలపై ‘సాక్షి’ నిఘా పెట్టి వరుస కథనాలు ప్రచురించింది. ఆ నివేదికలు, కథనాల ఆధా రంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం రంగంలోకి దిగింది. క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపట్టింది. అక్రమాలను గుర్తించింది. ఆపై జిల్లా అధికారులతో చర్చించింది.
సీఏంఓ కార్యాలయం నుంచి విచారణ
సాక్షిలో వచ్చిన కథనాలపై టీడీపీలోని కొందరు నేత లు సైతం స్పందించారు. జిల్లాలో జరుగుతున్న అక్ర మ బాగోతాన్ని రాష్ట్ర స్థాయి అధికారులు, అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అక్రమ గ్రానైట్‌పై సీఎంఓ కార్యాలయం విచారణ చేపట్టింది. జిల్లా మైనింగ్ శాఖ డీడీ సత్యనారాయణకు కార్యాలయ అధికారులు ఫోన్ చేసి విచారించినట్లు తెలిసింది. ఫోన్‌లోనే అర్ధగంట పాటు విచారణ సాగింది. పలు విషయాలపై అక్కడి అధికారులు గుచ్చిగుచ్చి అడిగినట్లు సమాచారం. ప్రఽ దానంగా ఈ అక్రమాలకు సహకరిస్తున్న.. ఆ అధికారి ఎవరంటూ గట్టిగానే అడిగినట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.


