అలసత్వం వద్దు
చిత్తూరు కలెక్టరేట్ : వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల పట్ల పండుటాకులే అని అలసత్వం వహించకూడదని లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి పద్మ జ అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని రాస్ వృద్ధాశ్రమంలో సోమవారం వయోవృద్ధుల సంరక్షణ, హక్కు ల అంశంపై అవగాహన కార్య క్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం–2007 పై అవగాహన కలిగి ఉండాలన్నారు. వయోవృద్ధుల సంరక్షణ, పోషణను విస్మరిస్తే శిక్ష తప్పదన్నారు. కుటుంబపరంగా ఎదురవుతున్న సమస్యలపై న్యాయం జరగాలంటే వయోవృద్ధులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పిల్లల ద్వారా నిరాదరణకు గురవుతున్న తల్లిదండ్రుల హక్కులకు రక్షణ కల్పించేందుకే ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విభిన్నప్రతిభావంతుల శాఖ ఇన్‌చార్జి ఏడీ విక్రమ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
రేపు పీఎం కిసాన్ నిధులు జమ
చిత్తూరు రూరల్(కాణిపాకం): జిల్లాలోని రైతులకు బుధవారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు జమకానున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీకృష్ణ తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 2,05,753 మంది రైతులకు రూ.102.88కోట్లు జమకానుందన్నా రు. పీఎం కిసాన్ పథకం కింద 1,67,900 మంది రైతులకు రూ.33.58కోట్లను కేంద్ర ప్రభుత్వం జమ చేయనుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 3,73,653 రైతు ఖాతాలకు రూ.136.46కోట్ల నగదు జమ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి రైతుకు రూ.5 వేలు, పీఎం కిసాన్ ద్వారా రూ.2 వేల చొప్పున్న జమ కానుందని వెల్లడించారు.
ఆపదమిత్ర వలంటీర్లకు శిక్షణ
చిత్తూరు కలెక్టరేట్ : గుంటూరు జిల్లాలో డిసెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు ఆపదమిత్ర వలంటీర్లకు శిక్షణ ఉంటుందని జిల్లా యువజనశాఖ అధికారి ప్రదీప్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మంత్రిత్వ శాఖ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆపదమిత్ర వలంటీర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. గుంటూరులో వారం రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణలో ఆపదమిత్ర వలంటీర్‌లకు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే సహాయక చర్యలు ఎలా చేపట్టాలి అనే అంశం పై శిక్షణ ఇస్తారన్నారు. ఈ శిక్షణకు జిల్లాలో ఎంపికై న వలంటీర్‌లు హాజరుకావాలన్నారు. కొత్తగా పాల్గొనేందుకు 18 నుంచి 29 సంవత్సరాల లోపు వయస్సు ఉండి ఆసక్తి ఉన్న వారు 9908127829 నెంబర్‌లో సంప్రదించాలని ఆయన కోరారు.
20న ఉద్యోగమేళా
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ నెల 20న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఆ కళాశాల కెరీర్ గైడెన్స్ కో–ఆర్డినేటర్ షమ్స్‌అక్తర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె విలేకరుల తో మాట్లాడారు. చైన్నెకి చెందిన ప్రముఖ కంపెనీ లు ఉద్యోగ మేళాలో పాల్గొంటాయన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ అభ్యర్థులు సద్వినియో గం చేసుకోవాలన్నారు. హాజరయ్యే అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, రెండు ఫొటోలు తీసు కురావాలని తెలిపారు. ఇతర వివరాలకు 9440332708, 8919715836 సంప్రదించాలని కోరారు.
పోలీసు గ్రీవెన్స్‌కు 38 ఫిర్యాదులు
చిత్తూరు అర్బన్: చిత్తూరులోని జిల్లా ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో నిర్వహించిన పోలీసు ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 38 ఫిర్యాదులు అందాయి. సోమ వారం ఎస్పీ తుషార్ డూడీ ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో కుటుంబ తగాదాలు, వేధిపులు, డబ్బు తగాదాలు, భూ త గాదాలు, ఆస్తి తగాదాలకు సంబంధించినవి ఉన్నాయి. వచ్చిన ప్రతీ ఫిర్యాదుపై క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వీటిని ఆన్‌లైన్‌లో సైతం నమోదు చేయాలన్నారు. పలు ఫిర్యాదులపై ఆయా స్టేషన్ హౌజ్ ఆఫీసర్లతో ఫోన్‌లో మాట్లాడారు. అలాగే చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర్‌రాజు సైతం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
అలసత్వం వద్దు
అలసత్వం వద్దు


